హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఔషధ తయారీ రంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారనుండగా, విద్యుత్ ఉత్పత్తి, ఓడ రేవులు, ఆయిల్, సహజ వాయువు వంటివి ఆంధ్రపదేశ్(సీమాంధ్ర) ఆర్థిక వ్యవస్థకు కీలకం కానున్నాయి. కోస్తాంధ్ర సుమారు వెయ్యి కిలో మీటర్ల పొడువు గల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అంతేగాక ఈ తీరంలో కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం లాంటి ప్రైవేటు ఓడరేవులతోపాటు విశాఖపట్నం ప్రభుత్వ రంగ ఓడరేవును కలిగింది.
ఓడ రేవుల ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు లాంటి సరుకుల ఎగుమతులు, దిగుమతుల మూలంగా ఆ రాష్ట్రానికి అధిక మొత్తంలో ఆదాయం రానుంది. లోక్‌సత్తా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో రాయలసీమ ప్రాంతానికే ఎక్కువ నష్టమని అన్నారు. ఈ ప్రాంత ఆదాయంపై విభజన ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న హైదరాబాద్ 2012-13 గానూ 13వేల కోట్ల మిగులు ఆదాయంతో ఉండగా రాయలసీమ ప్రాంతం 7వేల కోట్ల లోటును కలిగి ఉందని జెపి చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో ఇది 9వేల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడనుందని జెపి అన్నారు.
కాగా 6వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ కేంద్రంతోపాటు 20వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం లక్ష్యంతో మరో ప్రాజెక్టును ఏర్పాటు చేసేలా 12వ పంచవర్ష ప్రణాళికలో పొందుపర్చనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది.
తెలంగాణ మాత్రం రోడ్డు, రైలు మార్గం ద్వారా జరిపే రవాణా వ్యవస్థపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు డ్రగ్స్, ఫార్మా ఎగుమతులు, దిగుమతుల కోసం కావాల్సిన సదుపాయాలు హైదరాబాద్‌లో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు లేవు. భారతదేశ ఫార్మా ఎగుమతుల రంగంలో హైదరాబాద్ దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉంది.
ఆంధ్రప్రదేశ్ సిఐఐ మాజీ అధ్యక్షుడు, కోస్తా రాయలసీమ అభివృద్ధి చీఫ్ కో-ఆర్డినేటర్ హరీష్ చంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని వసతులతో కూడిన రాజధానిని కలిగి ఉందని, అయితే సీమాంధ్ర మాత్రం రాజధాని ప్రాంతాన్ని గుర్తించి, నిర్మించుకోవాల్సిన ఉందని తెలిపారు. విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్కసారి సీమాంధ్రలోని కెజి బేసిన్ గ్యాస్ ఉత్పత్తి మొదలైతే, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటును సీమాంధ్రలో ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ మిగులు ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఫౌండర్ సందీప్ కుమార్ మక్థల మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగానికి భారీ మొత్తంలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ పెట్టుబడులను పెట్టేందుకు ఉత్సాహంతో ఉన్న బహుళ జాతి సంస్థలు ఈ అనిశ్చితి కారణంగా ముందుకు రాలేదని, ప్రస్తుతం పార్లమెంటు తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందున తమ పెట్టుబడులను హైదరాబాద్‌లో పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు.
ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సందీప్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్, ఎండి బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రకాల మౌలిక వసతులు కలిగిన హైదరాబాద్, విభజనపై అనిశ్చితి తొలగిపోవడంతో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని అన్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ప్రాంతం కూడా కొత్త రాజధాని ఏర్పాటు కానుండటంతో ఇంకా అభివృద్ది చెందగలదని ఆయన తెలిపారు. ఐటి దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల కార్యకలాపాలు కూడా హైదరాబాద్ నుంచి సాగుతున్నాయని ఆయన చెప్పారు.
కాగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2.19 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సీమాంధ్రలోని విశాఖపట్నంలో 2005లో జవహర్ లాల్ ఫార్మా సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 3,43,000 కోట్ల పెట్టుబడులతో పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్(పిసిపిఐఆర్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం 2008లో ఆమోదం తెలిపింది.
More From GoodReturns

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications