న్యూయార్క్: ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్సప్ యాప్‌ను కొనుగోలు చేయనున్నట్లు సోషల్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ప్రకటించింది. ఇందుకోసం 19 బిలియన్ డాలర్ల (రూ. 1,14,000 కోట్లు) నగదు, స్టాకులను ఫేస్‌బుక్ వెచ్చించనుంది. ఈ ఒప్పందంలో 12 బిలియన్ డాలర్ల ఫేస్‌బుక్ షేర్లు, 4 బిలియన్ డాలర్ల నగదు, 3 బిలియన్ డాలర్ల స్టాక్ యూనిట్లు చేరివున్నాయి.
కాగా ఈ కొనుగోలుతో ఫేస్‌బుక్, వాట్సప్‌కున్న 45కోట్ల మంది వినియోగదారులతో కలుపుకొని ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక నెట్‌వర్క్‌గా అవతరించనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్, ఈ వివరాలను గురువారం వెల్లడించింది. ఈ కొనుగోలు తర్వాత, వాట్సప్ బ్రాండ్ కొనసాగుతుందని, కంపెనీ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని వౌంటెన్‌వ్యూలో అలాగే ఉంటుందని ఫేస్‌బుక్ తెలిపింది. 100 కోట్ల మందితో అనుసంధానం కావడానికి వాట్సప్ ఒక మాధ్యమమని, దాని సేవలు వెలకట్టలేనివని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బెర్గ్ పేర్కొన్నారు.

మెసేజింగ్ అనేది చాలా పోటీతో కూడుకున్న రంగమని, ఇందులో వాట్సప్ లీడర్‌గా ఎదిగిందని ఆయన అన్నారు. తనకు వాట్సప్ వ్యవస్థాపక సిఈఓ జాన్ కోమ్ బాగా తెలునని, ఇలాంటి వ్యక్తితోనే కాకుండా అతని బృందంతో కలిసి పని చేయడం, ప్రపంచాన్ని మరింతగా కనెక్ట్ చేయడం ఆనందాన్నిస్తోందని అన్నారు. ఒప్పందం ప్రకారం కోమ్ ఫేస్‌బుక్ డైరెక్టర్ల బోర్డులో చేరతారని అన్నారు. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం మూలంగా వాట్సప్ మరింతగా వృద్ధి చెందడానికే కాకుండా విస్తరించడానికి అవకాశం ఉంటుందని కోమ్ తన బ్లాగ్‌లో రాశారు.
ఫేస్‌బుక్ సొంతమైన తర్వాత కూడా వాట్స్ యాప్ స్వతంత్రంగానే కార్యకలాపాలు సాగించనుందని కోమ్ తెలిపారు. కాగా వాట్సప్‌కున్న యాక్టివ్ కస్టమర్లు డబ్బులు చెల్లించడం ప్రారంభిస్తే ఈ కంపెనీకి 45 కోట్ల డాలర్ల రాబడి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న కాలంలో కంప్యూటర్ల ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను యాక్సెస్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్న ఫేస్‌బుక్, మొబైల్ ఫోన్ ఆధారితంగా పని చేసే యాప్‌లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాజా డీల్ వల్ల యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ముఖ్యంగా భారత్‌లో విస్తరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని అంటున్నారు.
అతిపెద్ద డీల్
గత రెండుమూడేళ్ల కాలంలో చోటు చేసుకున్న ఐటి ఒప్పందాలలో తాజా ఫేస్‌బుక్-వాట్సప్ ఒప్పందమే అతిపెద్దది. 2011 సంవత్సరం స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ 850 కోట్ల డాలర్లు. నోకియాకు చెందిన ఫోన్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. 2001 సంవత్సరంలో ఎఒఎల్‌తో టైమ్ వార్నర్స్ విలీనానికి సంబంధించి డీల్ విలువ 12,400 కోట్ల డాలర్లు. ఆ తర్వాత కుదిరిన అతిపెద్ద ఇంటర్నెట్ డీల్స్‌లో తాజా డీల్ అతిపెద్దదని విశ్లేషకులు చెబుతున్నారు.
వాట్సప్
వాట్సప్ ఇంటర్నెట్ ఆధారిత క్రాస్-ప్లాట్ ఫాం మొబైల్ అప్లికేషన్. ఎలాంటి టెలికాం ఛార్జీలు లేకుండా సంక్షిప్త సందేశాలను, ఫొటోలు, వీడియోలను కూడా మొబైల్ వినియోగదారులు ఒకరినొకరు చేరవేసుకునే, పంచుకునే అప్లికేషన్. ఈ యాప్‌ను 2009 సంవత్సరంలో ఉక్రెయిన్‌కు చెందిన జాన్ కోమ్, అమెరికాకు చెందిన బ్రియాన్ ఆక్టన్‌లు ప్రారంభించారు. ప్రస్తుతం వాట్సప్ నెలవారీ యూజర్ల సంఖ్య 45 కోట్లుగా ఉంది. వీరిలో 70 శాతం మంది యాక్టివ్‌గా ఉన్నారు.
రోజుకు 10 లక్షలకు పైగా కొత్త యూజర్లు వాట్సప్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ (14.5 కోట్లు), జిమెయిల్ (12.3 కోట్లు), ట్విట్టర్ (5.4 కోట్లు), స్కైప్ (5.2 కోట్లు)లకు ఉన్న యూజర్ల కన్నా వాట్‌యాప్ యూజర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లతోపాటు ఫొటోలు, వీడియోలను ఇతరులతో పంచుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications