హైదరాబాద్/విజయవాడ: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్‌లో కూడా రియల్ బిజినెస్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అందుకు అవకాశమున్న ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా అత్యధికంగా పెరిగిపోయాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపుమీద కొనసాగుతోంది.
రాష్ట్ర విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించినా రాష్టప్రతి ఆమోదం పొందినప్పటి నుంచే వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, సంపన్నులు ఈ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అడ్వాన్సులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీమాంధ్రకు చెందిన చాలా మంది నాయకులు ఖాళీ భూములను బినామీల పేరిట తమ సొంతం చేసుకున్నారన్న ప్రచారమూ ఉంది. మరికొందరైతే ఆయా ప్రాంతాల్లోని తమ ఇళ్ల అద్దెలు ఇబ్బడిముబ్బడిగా పెరగగలవన్న అంచనాతో సంబరబడిపోతున్నారు.

ప్రభుత్వం ఇటీవల లక్షా 30 వేల ఎకరాల అటవీ భూమిని ‘డీ నోటిఫై' చేసిందని మరికొందరు అంటున్నారు. దీని ప్రకారం ప్రకాశం, కర్నూలు జిల్లాల మధ్యలోని నల్లమల అడవులు లేదా రంపచోడవరం అడవుల పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. గుంటూరు - విజయవాడ మధ్య ఉన్న నాగార్జున యూనివర్సిటీని మరో ప్రాంతానికి తరలించడం ద్వారా అక్కడ రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోని దేవాలయ, వక్ఫ్ భూములు, అటవీ భూములు దాదాపు 30 వేల ఎకరాలను కబ్జాదారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే విభజన బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచి.. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని కాకపోయినా భవిష్యత్ అవసరాల కోసం ఈ భూముల స్వాధీనం తప్పదని ఉన్నతాధికారులు చెబుతుండటం గమనార్హం.
అయితే కృష్ణా జిల్లాలోని విజయవాడ అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి రహదారుల పరంగా, రైల్వే పరంగా కూడలి ప్రాంతం. ఇప్పటికే నిత్యం 300 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంకా విజయవాడ సమీపంలోనే గన్నవరం విమానాశ్రయం, బందరు ఓడరేవు ఉంది. విజయవాడను తాకుతూ కృష్ణా నది ప్రవహిస్తుండటంతో నీటి సమస్య కూడా ఉత్పన్నం కాదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా విషయానికొస్తే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రం ఒంగోలు వాసులే ఏడాది పొడవునా తాగునీటికి తహతహలాడాల్సి వస్తుంది.
గతంలో ఆంధ్రా రాష్ట్రం ఏర్పాటు సమయంలో విజయవాడకు రాజధాని అవకాశం వచ్చినట్టే వచ్చి కర్నూలుకు తరలిపోయింది. అయితే ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు సమదూరంలో ఉండి, తెలంగాణ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాలనే రాజధాని చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసే అవకాశం ఉంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications