విశాఖ ఉక్కు సిఎండికి కార్పొరేట్ లీడర్ అవార్డు

ఆర్థిక వ్యవహారాల విభాగం జూనియర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మధుసూదన్, గత 30 ఏళ్లలో ఛైర్మన్ స్థాయికి చేరుకోవడం ఆయనలోని నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఆయనే కావటం విశేషం.
ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. సమష్టి కృషి, ఉత్తమ ప్రణాళికతో కూడిన నాయకత్వం ఉండటంతో విశాఖ ఉక్కు ప్లాంట్ అభివృద్ధికి కారణమని అన్నారు. విస్తరణ కార్యకలాపాలతో దేశీయ ఉక్కు పరిశ్రమల్లో అతి పెద్ద సంస్థగా ఆవిర్భంచనుందని మధుసూదన్ పేర్కొన్నారు.
పురస్కారం అందుకున్న వారిలో మధుసూదన్‌తోపాటు పవర్ గ్రిడ్, ఎంఎంటిసి, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర కర్మాగారాల ఛైర్మన్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ అరోరా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications