షాడో బ్యాంకింగ్ అనే పదాన్ని ఆర్థిక వేత్త పాల్ మెక్‌కుల్లె పరిచయం చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహించే అన్ని విధులను నిర్వహించే ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఆయన షోడో బ్యాంకింగ్‌కు నిర్వచనం ఇచ్చారు. ఇలాంటి సంస్థలు బ్యాంకులు అందించే సేవలందించినప్పటికీ వీటిపై ఇతర బ్యాంకులకు ఉన్నట్లు నియంత్రణ ఉండదు.
ఫైనాన్షియల్ స్టబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్‌బి) ప్రకారం.. షాడో బ్యాంకింగ్ అంటే.. నియంత్రణ వ్యవస్థలోకి రాకుండా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిని షాడో బ్యాంకింగ్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండటం, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెచ్చిపెట్టగలవని ఇటీవలి ఆర్థిక సంక్షోభం తెలియజెప్పడంతో ఇటువంటి వాటిపై ఆందోళన నెలకొంటున్నాయి.
షాడో బ్యాంకింగ్ కార్యకలాపాల పెరుగుదలకు కారణాలు
ప్రపంచ వ్యాప్తంగా షాడో బ్యాంకింగ్ కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్ స్టబిలిటీ బోర్డ్ నివేదిక ప్రకారం 2002 నుంచి 2007 మధ్య కాలంలో షాడో బ్యాంకింగ్ కార్యకలాపాల విలువ 26 ట్రిలియన్ డాలర్ల నుంచి 62 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత 2011లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా అది 67 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఒక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ కార్యకలాపాలు విస్తరించలేకపోవడం, వాటి ప్రభావం చాలా తక్కువగా ఉండటం కూడా షాడో బ్యాంకింగ్ పురోగతికి కారణంగా చెప్పుకోవచ్చు. చైనా దేశంలో అనేక చిన్న చిన్న ఎంటర్ ప్రైజెస్ తమ ఆర్థిక కార్యకలాపాలను కొనస్తున్నాయి. అయితే వాటిని నియంత్రించడంలో చైనా విఫలం కావడం, రెగ్యూలేటెడ్ బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోవడంతో షాడో బ్యాంకింగ్ ఆ అంతరాన్ని పూడ్చేందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
షోడో బ్యాంకింగ్‌తో నష్టాలు
షాడో బ్యాంకింగ్ కార్యకలాపాల వల్ల ఏదో ఒక సమయంలో ఆర్థిక వ్యవస్థ ద్రవ్య సంబంధమైన సమస్యను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర బ్యాంకుల లాగా నియంత్రణ లేనందువల్ల షాడో బ్యాంకింగ్ సంస్థలు, కేంద్ర బ్యాంకు నుంచి అప్పులు తీసుకునే అవకాశాలు లేవు కాబట్టి, అవి ఆర్థిక పరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇతర ఆర్థిక కేంద్రాలపై ఆధారపడి కొనసాగుతున్న షాడో సంస్థల వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగే అవకాశం ఉంది. అందువల్ల షోడో బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలను విధించడం, సూచనలను చేయడం వంటి చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలు, ఉన్నత సంసస్థలపై ఉంటుంది.
భారతదేశంలో షాడో బ్యాంకింగ్
భారతదేశంలో మాత్రం షాడో బ్యాంకింగ్ వృద్ధి అనేది పరిమితంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక విభిన్న సంస్థలు, ఎన్‌బిఎఫ్‌సిలు లాంటి సంస్థలు కేంద్ర ఉన్నత ఆర్థిక సంస్థచే నియంత్రించపడుతున్నాయి. కాగా అంతర్జాతీయ ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థలు మాత్రం భారతదేశంలో షాడో బ్యాంకింగ్ నెమ్మదిగా పెరుగుదలను నమోదు చేస్తోందని పేర్కొంటున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications