
ప్రధానంగా అమెరికా మార్కెట్‌లో తాము విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ ఔషధాల అమ్మకాలు ఈ వృద్ధికి ఊతం ఇచ్చాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మంగళవారం తెలిపారు. మూడో త్రైమాసికంలో ఉత్తర అమెరికా, ఇతర వర్థమాన మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగాయని కంపెనీ జనరిక్స్ విభాగం ప్రెసిడెంట్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. యూరోపియన్ మార్కెట్లు మాత్రం కొంత నీరసంగానే ఉన్నాయని, అక్కడ చెప్పుకోదగినంత వృద్ధిని సాధించలేకపోతున్నామని ఆయన తెలిపారు.
భవిష్యత్‌లో కూడా యూరోపియన్ మార్కెట్ తమ అమ్మకాలకు ఊతం లభించకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మూడో త్రైమాసికంలో తమ కంపెనీ ఏడు కొత్త జనరిక్ ఔషధాలను విడుదల చేసిందని, మార్చి చివరిలోగా మరో రెండు కొత్త ఔషధాలు విడుదల కావచ్చునని అభిజిత్ ముఖర్జీ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని కొత్త జనరిక్ ఔషధాలు విడుదల చేయడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.
మూడో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 23 శాతం వృద్ధితో 2,865.16 కోట్ల నుంచి 3,533.76 కోట్ల రూపాయలకు పెరిగిందని సౌమెన్ చక్రవర్తి తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతోనే ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో డాక్టర్ రెడ్డీస్ 9,740 కోట్ల రూపాయల ఆదాయంపై 2,520 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. ఈ తొమ్మిది మాసాల కాలంలో ఆదాయాల్లో 17.5 శాతం, లాభంలో 36 శాతం వృద్ధి నమోదు చేసింది.
ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా ప్రాంతంలో అమ్మకాలు భారీ స్థాయిలో 76 శాతం పెరగ్గా, రష్యా, సిఐఎస్ వంటి వర్థమాన మార్కెట్లలో 25 శాతం వృద్ధి చోటు చేసుకుందని సౌమెన్ చక్రవర్తి తెలిపారు. అయితే భారత్‌లో మాత్రం కొత్త ఫార్మా ధరల విధానం కింద సద్దుబాట్ల కారణంగా పరిమిత స్థాయిలో ఐదు శాతం వృద్ధి మాత్రమే చోటు చేసుకున్నదన్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఆర్ అండ్ డి ఫోకస్ గల కంపెనీగానే తన గుర్తింపును కొనసాగించుకుంటుందని సౌమెన్ తెలిపారు. మూడో త్రైమాసికంలో తాము ఆర్ అండ్ డిపై 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఈ విభాగంపై పెట్టుబడి వెయ్యి కోట్లు దాటవచ్చునని ఆయన అంచనా వేశారు. అయితే డాక్టర్ రెడ్డీస్ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ మదుపరులను ఆకర్షించలేకపోయింది. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 2,699 గరిష్ట ధర పలికిన రెడ్డీస్ షేరు ఒక దశలో రూ. 2,625కు పడిపోయింది. ఆ తర్వాత కొంతమేర కోలుకుని రూ. 2,660 వద్ద ముగిసింది. ఇది సోమవారంతో పోల్చితే రూ. 11.20 తక్కువ కావడం గమనార్హం.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications