మైక్రోసాఫ్ట్ సిఈఓగా సత్య: హెచ్‌పిఎస్‌లో సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం పాఠశాల బోర్డు సభ్యులు, అధ్యాపకులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. నాడు ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థి నేడు మైక్రోసాప్ట్ సిఈఓగా ఎంపిక కావడంతో తమ పాఠశాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందని దానిని అందిపుచ్చుకున్న వాళ్లే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వారు అన్నారు. స్థానిక, జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సందర్భంగా బేగంపేట పబ్లిక్‌స్కూల్‌లో హడావుడి చేశాయి. రాజ్యసభ సభ్యుడు వైవి చౌదరి మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ సిఈఓగా నియమితుడైన సత్య నాదెళ్లది స్ఫూర్తి దాయక ప్రయాణమని అన్నారు.
అతడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన సమయంలో యావరేజ్ స్టూడెంటేనని, అందరి పిల్లల్లా అల్లరిగా ఉండేవాడని నాటి సత్య నాదెళ్ల సహచర విద్యార్థులు తెలిపారు. ఆటల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే వాడని.. అయితే అన్నింట్లో చాలా ఆసక్తి చూపేవాడని చెప్పారు. ఆ సాధారణ విద్యార్థి ప్రస్తుతం అసాధారణ వ్యక్తిగా ఎదిగాడని అన్నారు. దేశంతో పాటు ముఖ్యంగా తెలుగు వారి సత్తాను ప్రపంచ నలుమూలలా సగర్వంగా చాటాడని కొనియాడారు.
నాటి ఆయన సహ విద్యార్థులు అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూనే సత్య మైక్రోసాఫ్ట్ సిఈఓ పీఠాన్ని అధిరోహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1978నుంచి 84 వరకు సత్య నాదెళ్ల బేగంపేటలోని హెచ్‌పిఎస్‌లో 7వ తరగతి నుంచి 12 (1978- 1984) వరకు చదువుకున్నారు. 6 సంవత్సరాల విద్యాభ్యాసం అనంతరం 1984 జూన్ ఏడో తేదీ లీవింగ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. పాఠశాలలో ఆయన ఆడ్మిషన్ నంబర్ 166/78. పూర్తి పేరు నాదెళ్ల సత్యనారాయణ. తండ్రి పేరు యుగంధర్. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి, ఆనందంలో పాలు పంచుకున్నారు.
2011లో హెపిఎస్‌కు వచ్చిన నాదెళ్ల
సత్యకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై ఉన్న మక్కువతో మైక్రోసాప్ట్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నప్పుడే తనకు బాగా ఇష్టమైన రోబోటిక్ అంశంపై ఐ స్పార్క్ పేరుతో ఈ స్కూల్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాఠశాలలో చాలా సమయం కేటాయించారు. రోబోటిక్ కార్యక్రమం గురించి ఆయన విద్యార్థులకు వివరంచారని పాఠశాల కార్యదర్శి ఫయాజ్‌ఖాన్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ సహకారంతో రోబోటిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

హెచ్‌పిసిలో సమావేశం
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో ఆయన విద్యనభ్యసించిన నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం పాఠశాల బోర్డు సభ్యులు, అధ్యాపకులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నాదెళ్ల సహచరులు, అధ్యాపకులు
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో ఆయన విద్యనభ్యసించిన నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైన సత్య నాదెళ్ల సహచరులు.

హెచ్‌పిఎస్ విద్యార్థులు
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో ఆయన విద్యనభ్యసించిన నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. సమావేశానికి హాజరైన పాఠశాల విద్యార్థులు.

సత్య సహచరులు, అధ్యాపకులు
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో ఆయన విద్యనభ్యసించిన నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం పాఠశాల బోర్డు సభ్యులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పూర్వ, ప్రస్తుత విద్యార్థులు
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాప్ట్ సిఈఓగా సత్య నాదెళ్ల నియామకం ఖరారు కావడంతో ఆయన విద్యనభ్యసించిన నగరంలోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ముందు పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో అధ్యాపకులు.


Click it and Unblock the Notifications