
ఈ కేసులో సర్ఫాసీ చట్టం కింత ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఇండియాబుల్స్‌కు లేనందున, రుణాల రికవరీకి ఇతర చట్టాల కింద చర్యలు చేపట్టవచ్చని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.
ఇండియా బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సుమారు రూ. వంద కోట్ల వరకు రుణం తీసుకుంది. ఆ రుణం చెల్లించక పోవడంతో డిసి ఆస్తుల వేలానికి సర్ఫాసి చట్టం ప్రకారం గతేడాది డిసెంబర్ 24న ఇండియా బుల్స్ ప్రపోసిడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ.. డిసి హైకోర్టును ఆశ్రయించింది. రుణం తీసుకునే నాటికి ఇండియా బుల్స్ సర్ఫాసి చట్ట పరిధిలో లేదని డిసి చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.
పెరిగిన లాంకో నష్టాల్లో
లాంకో ఇన్‌ఫ్రాటెక్ నష్టాల్లోనే కొనసాగుతోంది. లాంకో నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.529.68 కోట్లుగా నమోదయ్యాయి. పోయనసారి నష్టాలు రూ.465 కోట్లుగానే ఉండగా, బకాయిల వసూళ్లలో ఆలస్యం, బొగ్గు కొరత వంటివి నష్టాలకు కారణమని బిఎస్‌ఇకి సంస్థ తెలిపింది. ఆదాయం ఈసారి రూ.2,515 కోట్లుండగా, పోయినసారి రూ.3,716 కోట్లుగా ఉంది. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు హైడ్రో పవర్ ప్రాజెక్టులను అమ్మాలని లాంకో ఇన్‌ఫ్రాటెక్ నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications