రూ. 530 కోట్ల నష్టాల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా టెక్

 lanco Infra in loss of Rs 530 crores
హైదరాబాద్: ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాల్లోని ప్రధాన సంస్థల్లో ఒకటైన లాంకో ఇన్‌ఫ్రా టెక్ నష్టాలు పెరిగాయి. 2013 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 530 కోట్ల రూపాయల నష్టం ప్రకటించింది. నిరుడు ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరనష్టం 465 కోట్ల రూపాయలుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో స్థూల రాబడి కూడా 3,716 కోట్ల రూపాయల నుంచి 2,515 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ త్రైమాసికంలో విద్యుత్ వ్యాపారం నుంచి రాబడి 32 శాతం తగ్గి 2533 కోట్ల రూపాయల నుంచి 1,735 కోట్ల రూపాయలకు చేరింది. ఇపిసి బిజినెస్ కూడా 625 కోట్ల రూపాయల నుంచి 304 కోట్ల రూపాయలకు పడిపోయింది.

ఈ త్రైమాసికంలో వడ్డీల కింద కంపెనీ 678 కోట్ల రూపాయలు చెల్లించింది. వివిధ రాష్ట్రాల విద్యుత్తు బోర్డులు, వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిల మొత్తం 2,765.76 కోట్ల రూపాయలున్నట్టు కంపెనీ వెల్లడించింది. బొగ్గు సరఫరా తగినంత లేకపోవడం, గ్యాస్ కొరత వంటి కారణాలతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితిలేదు. మరోవైపు టారీఫ్‌లకు సంబంధించిన అస్పష్టత, వినియోగదారుల నుంచి బకాయిలు వసూలు కాకపోవడం వంటి సమస్యలు కూడా తోడయ్యాయి. వీటి వల్ల రాబడి తగ్గడంతో పాటు నష్టాలు కూడా పెరిగినట్టు కంపెనీ వివరించింది.

అధీకృత మూలధనం పెంపు

కంపెనీ అధీకృత మూలధనం ప్రస్తుతం 5,000 కోట్ల రూపాయలుండగా దానిని 12,000 కోట్ల రూపాయలకు పెంచాలని లాంకో ఇన్‌ఫ్రాటెక్ యాజమాన్యం ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి షేర్ హోల్డర్ల ఆమోదం కోరాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కంపెనీకి ప్రమోటర్లు అన్‌సెక్యూర్డ్ రుణంగా సమకూర్చిన 152 కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చాలన్న ప్రతిపాదనకు కూడా షేర్‌హోల్డర్ల ఆమోదం తీసుకునే అవకాశం ఉంది.

ఆసక్తి ఉన్న ఇతర రుణదాతల అప్పును కూడా ఈక్విటీగా మార్చేందుకు షేర్‌హోల్డర్ల ఆమోదం కంపెనీ తీసుకునే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే 7700 కోట్ల రూపాయల విలువైన రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అప్పులిచ్చిన సంస్థలు ఆమోదం తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+