
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 112గా ఉన్న భారత స్కోరు ప్రస్తుతం 115కు చేరిందని (నీల్సన్ సర్వే ఆఫ్ గ్లోబల్ సర్వే ఆఫ్ కన్స్యూమర్ కన్ఫిడెన్స్ అండ్ స్పెండింగ్ ఇంటెన్షన్ ఫర్ క్వార్టర్-4 2013) తెలిపింది. ఆర్థిక సంబంధిత ప్రతికూల వార్తలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తుందన్న నమ్మకం బలపడడంతో వినియోగదారుల్లో ఆశావహ ధృక్పథం నెలకొందని నీల్సన్ ఇండియా అధ్యక్షుడు పీయూష్ మాధుర్ అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 62 శాతం మంది భిప్రాయపడ్డారు. గత సర్వేలో కూడా 76 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
మైక్సోసాఫ్ట్ సిఈఓ పోటీలో మరో భారతీయుడు
న్యూయార్క్: ఇప్పటికే తెలుగు వాడైన సత్య నాదెళ్ల ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌కు సిఈఓగా పదవీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి మరో భారతీయుడు కూడా పోటీలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన సుందర్ పిఛై (42) మైక్రోసాఫ్ట్ సిఈఓ రేసులో ఉన్నట్లు సిలికాస్ యాంగిల్ వెబ్‌సైట్ వెల్లడించింది.
సుందర పిఛైతో చర్చలు జరుగుతున్నాయని కూడా ఆ వెబ్‌సైట్ పేర్కొంది. గూగుల్‌లో ఆండ్రాయిడ్, క్రోమ్, యాప్స్‌కు పిఛై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. సుందర్ ఖరగ్‌పూర్‌లో టెక్నాలజీ పట్టభద్రులయ్యారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన కూడా ఎంబిఏ పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications