నగరంలో మిల్లెట్ ఎక్స్‌పో (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, రైతులకు వ్యాపార సదుపాయం కల్పించడానికి ఈ ప్రదర్శన ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన రావు, హోం సైన్స్ కాలేజ్ డీన్ అనురాగ్ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే చిరుధాన్యాలను కొనుగోలు చేయడానికి నగరవాసులు ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలోనే ఇప్పుడు అన్ని రకాల చిరు ధాన్యాలు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు చెప్పారు.
ప్రదర్శనలోని ఫుడ్ స్టాళ్లలో చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను రుచిచూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

చిరుధాన్యలతో విద్యార్థినులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు.

చిరుధాన్యాల అలంకరణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో అలంకరించిన దృశ్యం.

హెల్తీ ఫాస్ట్‌వుడ్
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో హెల్తీ ఫాస్ట్ ఫుడ్స్ కూడా అందుబాటులో ఉంచారు

చిరుధాన్యాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. విధ రకాల చిరుధాన్యాలు.

పండుగలో విద్యార్థినులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచిన విద్యార్థినులు.

కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఉత్పత్తుల గురించి తెలుసుకుంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ.

ప్రారంభోత్సవం
రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ హోమ్ సైన్స్ విభాగం సంయుక్తంగా 'చిరుధాన్యాల పండుగ-14' ను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications