ఇక అభివృద్ధిపైనే: సిఎం కిరణ్, వేరుపడినా.. (ఫోటోలు)

హైదరాబాద్: రాజకీయ అనిశ్చితిలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇక నుంచి అభివృద్ధిపైనే మాట్లాడతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బెర్జర్ పెయింట్స్ నిర్మించిన కొత్త ప్లాంట్‌ను శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిన్నటి వరకు రాజకీయ అంశాలపై మాట్లాడానని, ఇక నుంచి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడతానని తెలిపారు.

రాజకీయ అనిశ్చితి పతాక స్థాయిలో ఉన్న గత రెండు నెలల కాలంలోనూ సుమారు 11 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సిఎం కిరణ్ చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపడానికి ప్రభుత్వం ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుంతోందని తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే వారికి అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని, మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా సిఎం కిరణ్ పిలుపు ఇచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండడం ఒక సానుకూలత అయితే పెట్టుబడి ప్రతిపాదనల విషయంలో చురుగ్గా వ్యవహరించే అధికార యంత్రాంగం, పుష్కలమైన సహజ వనరులు, మౌలిక వసతులు ఉండడం మరో కారణమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పురోగమన పథంలో నడిపించడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక జోన్లలో మూడు మన రాష్ట్రానికి వచ్చాయని, మెదక్, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు ఇందుకు ఎంపికయ్యాయని ఆయన అన్నారు. పులికాట్ ప్రాంతంలో ఏడు వేల కోట్ల రూపాయలతో కొత్త పోర్ట్ నిర్మాణానికి కూడా అనుమతి లభించిందన్నారు. చెన్నై-బెంగళూరు మధ్య నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణ పట్నం, చిత్తూరులను కూడా భాగం చేశారని, దీని వల్ల ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి మరింతగా చోటు చేసుకుంటుందని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.

రాష్ట్రం వేరు పడినా పెట్టుబడులు భద్రమే

రాష్ట్ర విభజన వ్యవహారం పెట్టుబడులకు ఏ మాత్రం అవరోధం కాదని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. రాష్ట్రం వేరు పడినా పెట్టుబడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. బెర్జర్ పెయింట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వేరుపడడానికి ముందే ఆమోదం పొందిన పెట్టుబడులకు సంపూర్ణ రక్షణ కల్పించాలని, ఆ ప్రాజెక్టులను యథాతథంగా కొత్త రాష్ట్రాలు గౌరవించాలన్నది ఎంఓయుల్లో స్పష్టమైన అంశమని ఆయన వివరించారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బెర్జర్ పెయింట్స్ నిర్మించిన కొత్త ప్లాంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు.

ప్రారంభోత్సవంలో కిరణ్

ప్రారంభోత్సవంలో కిరణ్

అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బెర్జర్ పెయింట్స్ నిర్మించిన కొత్త ప్లాంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. రాజకీయ అనిశ్చితి పతాక స్థాయిలో ఉన్న గత రెండు నెలల కాలంలోనూ సుమారు 11 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సిఎం కిరణ్ చెప్పారు.

హాజరైన మంత్రులు

హాజరైన మంత్రులు

అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బెర్జర్ పెయింట్స్ నిర్మించిన కొత్త ప్లాంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు శైలజానాథ్, రఘువీరా రెడ్డితోపాటు ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి హాజరయ్యారు.

స్విచ్ నొక్కి ప్రారంభం

స్విచ్ నొక్కి ప్రారంభం

అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బెర్జర్ పెయింట్స్ నిర్మించిన కొత్త ప్లాంట్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపడానికి ప్రభుత్వం ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుంతోందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+