హైదరాబాద్: జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నెలకొల్పనున్న ప్లాంటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉంది గానీ, వ్యాపార అనిశ్చితి లేనేలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తపరిశ్రమల ఏర్పాటు దిశగా పారిశ్రామిక రంగాన్ని బాగా ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో మంచి అనుకూల వాతావరణం ఉందన్నారు.
ఏ పారిశ్రామికవేత్త కూడా మనను ఉద్ధరించడానికి రారని, ఇక్కడ వారికి ప్రయోజనం ఉంది కాబట్టే వస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొమ్మిది నెలల కాలంలోనే ఇసుజు మోటార్స్ తన ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిందని, ఇదే వేరే రాష్ట్రాల్లో అయితే కనీసం రెండేళ్లు పట్టి ఉండేదని ముఖ్యమంత్రి అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటున్న కార్ల కంపెనీ రాష్ట్రంలో ప్లాంటును ఏర్పాటు చేయడం పట్ల కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాలని, వారి కంపెనీ వాహనాన్ని కొనాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాని ముఖ్యమంత్రి ఇసుజు మోటార్స్ ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న తొలి కార్ల కంపెనీ ఇదేనని, మరిన్ని కంపెనీలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇసుజు మోటార్స్ ప్రెసిడెంట్, రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ సుసుము హొసోయ్ మాట్లాడుతూ.. భారత్‌లో వాహన తయారీ కార్యకలాపాలను ప్రారంబించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన వప్పందం మేరకు 107ఎకారా భూమిని పొందామన్నారు. రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. 2016 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడువేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇసుజి కార్ల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభంలో 50వేల యూనిట్లుగా ఉంటుందని చెప్పారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 120 వేల యూనిట్లకు పెంచనున్నట్లు హొసోయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఇసుజు కంపెనీ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ టకషి కికుచి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షిగెరు వకబయషి, శ్రీసిటీ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. కాగా పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పాల్గొంటూ వచ్చిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

కంపెనీ ప్రతినిధులతో సిఎం
జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నెలకొల్పనున్న ప్లాంటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేస్తున్న సిఎం
జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నెలకొల్పనున్న ప్లాంటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

కారు మోడల్
జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నెలకొల్పనున్న ప్లాంటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం శంకుస్థాపన చేశారు.
అందుకు సంబంధించిన వివరాలతో కూడిన బోర్డును చూపుతున్న దృశ్యం.

కంపెనీ ప్రతినిధులతో సిఎం
శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తోపాటు రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ, ఇసుజు కంపెనీ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ టకషి కికుచి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షిగెరు వకబయషి, ఇసుజు మోటార్స్ ప్రెసిడెంట్, రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ సుసుము హొసోయ్, శ్రీసిటీ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications