
ఆటో పరిశ్రమ సుదీర్ఘ మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో టాటా మోటార్స్ మెరుగైన పనితీరు కనబరచడానికి కార్ల్‌స్లిమ్ కీలకంగా వ్యవహరించారని టాటా మోటార్స్ పేర్కొంది. అక్టోబర్ 2012లో టాటా మోటార్స్‌లో ప్రవేశించిన ఆయన, దేశీయ మార్కెట్‌లో సంస్థ నిలదొక్కుకోవడానికి ఎంతగానో కృషి చేసినట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ పి మిస్త్రీ.. కార్ల్ స్లిమ్ మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సంస్థాగత వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా గతవారం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా ఆయన ప్రకటించినట్లు గుర్తుచేశారు. కార్ల్ స్లిమ్ చాలా విలువైన సహోద్యోగి అని ఆయన కొనియాడారు. భారత ఆటో పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన దృఢమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. భారతీయ ఆటోమొబైల్ తయారీరంగ సమాజం (సియామ్) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ మాట్లాడుతూ.. ఓ మంచి మిత్రుడిని కోల్పోయామని అన్నారు.
టాటా మోటార్స్‌లో చేరడానికి ముందు కార్ల్‌స్లిమ్ ఎస్‌జిఎండబ్ల్యు మోటార్స్, చైనా (జనరల్ మోటార్స్ జాయింట్ వెంచర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. అంతకు ముందు 2007-11 మధ్యకాలంలో భారత్‌లో జనరల్ మోటార్స్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు టొయోటా, జనరల్ మోటార్స్ కంపెనీల్లో కార్ల్ సిమ్ వివిధ హోదాల్లో పని చేశారు.


Click it and Unblock the Notifications