
బ్యాంకుల్లో తమకున్న ఖాతాల్లో పాత నోట్లను జమ చేసి కొత్త నోట్లను పొందాలని పేర్కొంది. కాగా, 2005కు ముందు ముద్రించిన నోట్లు మున్ముందు కూడా చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని ఆర్‌బిఐ తెలిపింది. కాబట్టి ప్రజలకు ఈ చర్య ద్వారా ఎలాంటి అసౌకర్యం కలగదని వివరించింది. జనవరి 22 నాటి ప్రకటనలో 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్ల ఉపసంహరణను ఆర్‌బిఐ ప్రకటించింది.
ఇప్పటికే బ్యాంకుల నుంచీ పాత నోట్లను వాపసు తీసుకుని, కొత్తవి అందజేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగే ప్రక్రియేనని తేల్చి చెప్పింది. 2005 కంటే ముందు ముద్రించిన నోట్లు ప్రజల వద్ద తక్కువగానే ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ఏడాది జులై 1 తరువాత కూడా పాత నోట్లను మార్చుకోవచ్చని, ఇందుకోసం తమకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.
త్వరలో హైదరాబాద్‌కు కస్టమ్స్ కమిషనరేట్
హైదరాబాద్: రాష్ట్రానికి త్వరలో కస్టమ్స్ కమిషనరేట్ రానుందని కేంద్ర ఎక్సైజ్, సేవా పన్ను శాఖ కమిషనర్ ఎంకె సింగ్ తెలిపారు. ఈ కమిషనరేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కస్టమ్స్ ఏజెంట్ల సంఘం రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
రానున్నదని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్‌టాక్స్‌ల కమిషనర్ ఎం.కె.సింగ్ తెలిపారు. ఈ కమిషనరేట్ వచ్చినట్టయితే కస్టమ్స్ క్లియరెన్స్‌లు సత్వరం జరుగుతాయని, ఫలితంగా ఎగుమతి కార్యకలాపాలు జోరందుకుంటాయని తెలిపారు.


Click it and Unblock the Notifications