ఈటీవీ నెట్‌వర్క్‌తో 18 గ్రూప్ డీల్ పూర్తి

హిందీ ప్రాంతీయ భాషా వార్తా ఛానళ్లు అయిన ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్ తోపాటు ఈటీవీ ఉర్దూల్లో 100 శాతం వాటాలు నెట్‌వర్క్ 18 సొంతమయ్యాయి. దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లైన ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాల్లో 50 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈటీవీ తెలుగు, ఈటీవీ-2లో 24.5 శాతం వాటా నెట్‌వర్క్ 18 కొనుగోలు చేసింది.
కాగా, ఈ ఒప్పందం ప్రకారం ఈటీవీ వార్తా ఛానళ్లు, తెలుగు మినహా ఇతర భాషల్లోని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ఇకపై టీవీ 18 నియంత్రణలోకి రానున్నాయి. ఈటీవీ ఛానళ్లలో వాటాల కొనుగోలు కోసం 2012 జనవరిలో ఈ ఒప్పందం కోసం నెట్‌వర్క్ 18 గ్రూప్, ముకేష్ అంబానీ నేత్వత్వంలోని రిలయన్స్ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థ ఈటీవీ ఛానళ్లల్లో తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించి, అందుకు ప్రతిగా ఈ గ్రూప్‌కు చెందిన డిస్ట్రిబ్యూషన్, కంటెంట్‌పై యాక్సెస్‌ను పొందింది.
ఆల్ టైమ్ రికార్డు సాధించిన బిఎస్ఈ
ముంబై: మార్కెట్‌కు ఊపునిచ్చిన కార్పొరేట్ ఫలితాలు, వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాల నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ బుధవారం మరో 87 పాయింట్లు పెరిగింది. దీంతో ఆల్‌టైమ్ రికార్డు అయిన 21,337.67 పాయింట్లకు చేరుకుంది. ఉదయం నుంచి మందకోడిగా సాగినా.. మధ్యాహ్నం చివర్లో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెనె్సక్స్ 86.55 పాయింట్లు పెరిగి 21,337.67 పాయింట్ల రికార్డు స్థాయికి చేరుకుంది.
దీంతో సెన్సెక్స్ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసినట్లయింది. మూడు రోజుల్లో సెన్సెక్స్ 247 పాయింట్లకు పైగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టాటాస్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, మహింద్ర, మహింద్ర షేర్లలో కొనుగోళ్లు ప్రధానంగా మార్కెట్ ఊపు కొనసాగడానికి కారణమైనాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 25.15 పాయింట్లు పెరిగి 6363.95 పాయింట్ల వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications