న్యూఢిల్లీ/హైదరాబాద్: తమ రాబడులు పెంచుకునేందుకు పలు విమానాయన సంస్థలు ప్రయాణ ఛార్జీలను సగానికి తగ్గించేశాయి. అయితే ఇది పరిమిత కాలానికేనని విమానయాన సంస్థలు ప్రకటించాయి. సాధారణంగా జనవరి నుంచి మార్చిలో గిరాకీ తక్కువ ఉండే నేపథ్యంలో తమ రాబడులను పెంచుకునేందుకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ తోపాటు ఇతర దేశీయ విమానయాన సంస్థలు ఛార్జీలను తగ్గించాయి. ఇండిగో, గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ 30-50 శాతం డిస్కౌంట్లు ప్రకటించినట్లు తమ వెబ్ సైట్లలో పేర్కొన్నాయి
స్పైస్ జెట్ డిస్కౌంట్ ఆఫర్ జనవరి 23 అర్ధరాత్రి వరకే అమల్లో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ప్రయాణానికి కనీసం నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్ టికెట్ రేట్‌పై 50 శాతం డిస్కౌంట్ ఇస్తారు. అయితే, ఏప్రిల్ 15లోపు మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలి. ఈ డిస్కౌంట్ రేట్ల ప్రకారం, హైదరాబాద్ నుంచి కోల్‌కతా టికెట్ 2,729 రూపాయలు, హైదరాబాద్-జైపూర్ టికెట్ 2,729 రూపాయలకు లభిస్తుంది.

ఎయిర్ ఇండియా కూడా దేశీయంగా అన్ని రూట్లలో 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తూ వసంతకాల ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. జెట్ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఆఫర్ బుధవారం నుంచి ప్రారంభమై జనవరి 24 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్య చేసే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు వర్తిస్తాయి. పన్నులతో సహా డిస్కౌంట్ రేట్లు కనిష్టంగా 1,357 రూపాయల నుంచి మొదలవుతున్నాయి.
అగర్తలా-కోల్‌కతా రూట్‌లో రేటు 1,385 రూపాయలుంటే, ఢిల్లీ-అహ్మదాబాద్ రూట్‌లో టికెట్ ధర 2,292 రూపాయలుంటుంది. ఎయిర్ ఇండియా సర్వీసులు నిర్వహిస్తున్న దేశీయ కేంద్రాలన్నింటికీ డిస్కౌంట్ రేట్లు వర్తిస్తాయి. రాబడులు పెంచుకోవడానికే డిస్కౌంట్ కల్పిస్తున్నామని, డిమాండ్ మందకొడిగా ఉండే సీజన్లో ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ ఆఫర్లు ఉపయోగపడతాయని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తెలుగు సాఫ్ట్‌వేర్‌తో సెల్ కాన్ హ్యాండ్‌సెట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ సెల్‌కాన్ తెలుగు సాఫ్ట్‌వేర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రూ. 1000 లోపు విలువైన ఫీచర్ ఫోన్లతో పాటు స్మార్ట్ ఫోన్లను కూడా ఇకపై ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ వంటి ప్రాంతీయ భాషల్లో వినియోగించుకునేలా తయారు చేస్తున్నట్లు సెల్ కాన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. గురు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన ఎ15, ఎ40 హ్యాండ్‌సెట్ల ధర 3600, 5600 రూపాయలని ఆయన చెప్పారు.
మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విపణిలోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్బంగా కంపెనీ ఎండి వై గురు మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల వారు సెల్‌ఫోన్లను ఇతరులతో సంభాషించేందుకు మాత్రమే వినియోగిస్తున్నారని, వారికి బంధుమిత్రుల నంబర్లు స్టోర్ చేసుకునేందుకు గాని, మెసేజింగ్‌కు గాని భాష పెద్ద అవరోధంగా ఉందని ఆయన అన్నారు. ఈ లోటును తీర్చేందుకే తాము పూర్తిగా తమ సంస్థ ఆర్ అండ్ డిలోనే అభివృద్ధి చేసిన తెలుగు సాఫ్ట్‌వేర్‌తో హ్యాండ్‌సెట్లు తయారుచేశామని ఆయన తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications