రిపోర్ట్: 85 మంది చేతిలోనే సగం సంపద

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలో వెల్లడైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సంపన్నులుగా ఎదిగేందుకు రాజకీయ శక్తులను తమ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని తన నివేదికలో పేర్కొంది.
వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవడమే కాకుండా పన్నులు కూడా ఎగవేస్తున్నారని తెలిపింది. 1970 సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకున్న నివేదిక, 30 దేశాలకు 29 దేశాల్లోని సంపన్నుల పన్ను రేటు తగ్గుతూ వచ్చినట్లు పేర్కొంది. గత 30 సంవత్సరాల్లో ఆర్థిక అసమానతలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది.
సంపన్నులు పన్నులు ఎగవేస్తూ వస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని, 25 ఏళ్ల కాలంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృత మైందని తెలిపింది. ప్రపంచంలోని ఒక్క శాతం కుటుంబాల చేతుల్లోనే 46 శాతం ప్రపంచ సంపద ఉందని వెల్లడించింది. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలని, ఇందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదిక అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications