
దేశ వ్యాప్తంగా 2012లో 5.52 లక్షలకు పైగా లభించిన ఉద్యోగాలతో పోలిస్తే 2013లో లభించిన దాదాపు 5.5 లక్షల కొత్త ఉద్యోగాలు (0.4 శాతం తగ్గుదల) నమోదైనట్లు సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్, విశాఖపట్నంలలో స్వల్పంగానే అయినా.. ఉద్యోగాల సంఖ్య పెరుగుదల నమోదు చేసిందని అసోచాం నివేదికలో తేలింది. 2013లో వచ్చిన మొత్తం కొత్త ఉద్యోగాల్లో ఐదో వంతు అంటే 1.39 లక్షల ఉద్యోగాలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోనే వచ్చాయని సర్వేలో వెల్లడైంది.
మొత్తం 32 రంగాల్లో నిర్వహించిన ఈ సర్వే ద్వారా 20 రంగాల్లో ఉద్యోగాల తగ్గుదల నమోదు చేసినట్లు తేలింది. ఐటి, ఐటి హార్డ్‌వేర్ రంగం అత్యధిక ఉద్యోగ కల్పన రంగంగా నిలిచినప్పటికీ 2012లో పొందిన 2.36 లక్షల ఉద్యోగాలతో పోలిస్తే.. ఒక శాతం తగ్గి 2013లో 2.34 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని సర్వే తెలిపింది. మానవ వనరులు, విద్యాబోధన, బ్యాంకింగ్, నిర్మాణం, ఆర్థిక సేవలు, వస్తు రంగం, వ్యాపార ప్రకటనలు, స్థిరాస్తి రిటైల్, టెలికాం రంగాల్లో 2012తో పోలిస్తే 2013లో కాస్త ఎక్కువగా కొత్త ఉద్యోగాలు లభించాయని వెల్లడైంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరులలో 2012తో పోలిస్తే 12శాతం, 4శాతం మేర కొత్త ఉద్యోగాలు లభించాయని, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో వరుసగా 21 శాతానికి పైగా, 2 శాతం, 22 శాతం చొప్పున తగ్గుదల కనిపించిందని పేర్కొంది. ప్రథమ శ్రేణి నగరాలు హైదరాబాద్‌లో స్వల్పంగా 1శాతం మేర కొత్త ఉద్యోగాలు లభించగా.. అహ్మదాబాద్‌లో ఉద్యోగాలు 6.5 శాతం తగ్గాయి. ద్వితీయ శ్రేణి నగరాలు చండీగఢ్ 19 శాతం, కాన్పూర్ 21 శాతం, రాంచీ 25 శాతం, రాయ్‌పూర్ 25 శాతం, విశాఖపట్నం 1.5 శాతం చెప్పుకోదగిన విధంగా ఉద్యోగ వృద్ధిని నమోదు చేశాయని సర్వే పేర్కొంది.


Click it and Unblock the Notifications