‘ద టెర్రాస్’ను ప్రారంభించిన తబలా గ్రూప్(పిక్చర్స్)
హైదరాబాద్: ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల గ్రూప్‌లో భాగమైన తబలా 12వ వార్షికోత్సవం సందర్భంగా తమ క్లాసీ, సరికొత్త లాంజ్ ‘ద టెర్రాస్'ను నగరంలోని హైటెక్ సిటీలో శుక్రవారం ప్రారంభించింది. అహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమ స్పిరిట్స్‌తో ఎంతో ఆకర్షనీయమైన ప్రదేశంగా ఈ లాంజ్‌ను తీర్చిదిద్దారు. ద టెర్రాస్ లాంజ్ మెరిసే లైట్లతో ఆకర్షణీయంగా ఉండటంతోపాటు విశ్రాంతి గొలిపే నీలి కాంతులతో మరో సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయని నిర్వాహకులు తెలిపారు.
యువత, పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేయడం వల్ల ముచ్చటగొలిపే యాంబియన్స్, రుచికరమైన ఆహారం, ఉత్తమ సేవలు, మనసును హత్తుకునే సంగీతం ఇక్కడ ఆకట్టుకుంటాయని వారు చెప్పారు. ఎంపిక చేసిన అతిగొప్ప స్పిరిట్స్, వైన్స్‌తో కూడిన విభాగం, కాంటినెంటల్, తందూరి శైలిలో రుచికరమైన వంటకాలు నగర జీవితానికి నూతన జవసత్వాలను అందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఐటి కేంద్రంలో ఏర్పాటు చేయబడిన ద టెర్రాస్ అత్యంత సౌకర్యం, విశాలంగా ఉందని వారు తెలిపారు. ఈ లగ్జరీయస్ లాంజ్‌లో 80 మందికి పైగా అతిథులు ఒకేసారి ఆయా అనుభూతులను పొందే రీతిలో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ద టెర్రాస్ లాంజ్ ప్రారంభోత్సవ సందర్భంగా తబలా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్లు విక్రమ్, విజయ్ కదిరి మాట్లాడారు. ద టెర్రాస్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఆకర్షణీయమైన ఈ వాతావరణంలో అతిథులు మరింత ఆనందాన్ని, విశ్రాంతిని పొందడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు. తబలా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ జనరల్ మేనేజర్ కోటి రావు మాట్లాడుతూ.. సాధారణ సమావేశాలు, డ్రింక్స్ తీసుకోవడానికి, ఆధునిక, సౌకర్యవంతమైన పరిసర ప్రాంతాల్లో పని వేళల తరువాత గెట్-టుగేదర్స్‌కు సరైన ప్రదేశంగా ద టెర్రాస్ నిలువనుందని అన్నారు.

ద టెర్రాస్
ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల గ్రూప్‌లో భాగమైన తబలా 12వ వార్షికోత్సవం సందర్భంగా తమ క్లాసీ, సరికొత్త లాంజ్ ‘ద టెర్రస్'ను నగరంలోని హైటెక్ సిటీలో శుక్రవారం ప్రారంభించింది. అహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమ స్పిరిట్స్‌తో ఎంతో ఆకర్షనీయమైన ప్రదేశంగా ఈ లాంజ్‌ను తీర్చిదిద్దారు.

నిర్వాహకుల ఆనందం
ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల గ్రూప్‌లో భాగమైన తబలా 12వ వార్షికోత్సవం సందర్భంగా తమ క్లాసీ, సరికొత్త లాంజ్ ‘ద టెర్రస్'ను నగరంలోని హైటెక్ సిటీలో శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్రింక్స్ తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు అమిత్, ఎండి విజయ్ కదిరి, జిఎం కోటిరావు.

దీపకాంతుల్లో ద టెర్రాస్
ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల గ్రూప్‌లో భాగమైన తబలా 12వ వార్షికోత్సవం సందర్భంగా తమ క్లాసీ, సరికొత్త లాంజ్ ‘ద టెర్రస్'ను నగరంలోని హైటెక్ సిటీలో శుక్రవారం ప్రారంభించింది. రాత్రిపూట నీలి రంగు కాంతుల్లో వెలిగిపోతున్న ద టెర్రాస్ లాంజ్.

దీపకాంతుల్లో ద టెర్రాస్
రాత్రిపూట నీలి రంగు కాంతుల్లో వెలిగిపోతున్న ద టెర్రాస్ లాంజ్.


Click it and Unblock the Notifications