
అంచనాలను మించి రాణించిన టిసిఎస్
ఐటి దిగ్గజ కంపెనీ టిసిఎస్ మూడో త్రైమాసిక ఫలితాల్లోనూ అంచనాలను మించి రాణించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ ఏకీకృత లాభం 50.3 శాతం పైగా వృద్ధితో రూ. 5,333 కోట్లకు చేరింది. నిరుడు లాభం 3,550 మాత్రమే. రెండో త్రైమాసికం (రూ. 4,633 కోట్లు)తో పోలిస్తే తృతీయ త్రైమాసికం లాభంలో 15 శాతం వృద్ధి ఉంది. లైఫ్ సెన్సెస్, మీడియా, టెలికాం, ఉత్పత్తుల రంగంలోని ప్రాజెక్టులు, యూరప్‌లో కోలుకుంటున్న వ్యాపారాలు టిసిఎస్‌కు బాగా కలిసి వచ్చాయి.
ఏకీకృత ఆదాయాలు సైతం 32.5 శాతం వృద్ధి చెంది, రూ. 21,294 కోట్లకు చేరాయి. అంతక్రితం అక్టోబర్-డిసెంబరులో ఆదాయం రూ. 16, 070 కోట్లుగా ఉంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 15.1 శాతం, ఆదాయాలు 1.5 వాతం చొప్పున పెరిగాయి. మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో టిసిఎస్ తన నియామక లక్ష్యాన్ని పెంచింది. 2013-14లో అదనంగా 5వేల ఉద్యోగాలు జతచేస్తూ మొత్తం 55వేల నియామకాలు చేపడతామని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది.
లాభాల్లో 58శాతం వృద్ధి సాధించిన హెచ్‌సిఎల్
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హెసిఎల్ టెక్నాలజీస్ రూ. 1,496 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నిరుడు ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 944 కోట్ల. అంటే ఈ కంపెనీ నికర లాభం ఈసారి 58.4 శాతం పెరిగింది. యూరప్ వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, తయారీ విభాగాల్లో దక్కిన ఆర్డర్లు మెరుగైన ఫలితాలు రావడానికి దోహదం చేశాయి.
2013లో హెచ్ సిఎల్ ఆదాయం 500 కోట్ల రూపాయలు దాటిందని, ఇన్‌ఫ్రా, ఉత్పాదక రంగంలోని తమ కంపెనీ ఆదాయం 150 కోట్ల డాలర్లను దాటిందని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సిఈఓ అనంత్ గుప్తా తెలిపారు. ఏకీకృత ఆదాయం 30.4 శాతం పెరిగి రూ. 6,278 కోట్ల నుంచి రూ. 8,184 కోట్లకు చేరింది. ఈ ఫలితాల నేపథ్యంలో గురువారం హెచ్ సిఎల్ షేరు 52 వారాల గరిష్టానికి చేరింది. చివరకు 4.23 శాతం లాభంతో రూ. 1,391.90 వద్ద స్థిరపడింది.
ఇన్ఫోటెక్ లాభంలో 12శాతం వృద్ధి
హైదరాబాద్: ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి రూ. 69. 39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. నిరుడుతో పోల్చితే రాబడి 21.7 శాతం ( 475 కోట్ల రూపాయలు) పెరగగా నికర లాభం 12.3 శాతం (62 కోట్ల రూపాయలు) వృద్ధి చెందింది. నాలుగు త్రైమాసికాల తర్వాత కంపెనీ వ్యాపారం ఫ్లాట్‌గా ఉండటమే కాకుండా ఈ త్రైమాసికంలో వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందిందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. దీంతో ద్వితీయార్థంలో పటిష్ఠమైన వృద్ధిని నమోదు చేసుకోవచ్చని భావిస్తున్నట్ల ఆయన పేర్కొన్నారు.
సమీక్షా కాలంలో నిర్వహణా మార్జిన్లు 19.6 శాతంగా ఉండగా ఎఫెక్టివ్ టాక్స్ రేటు 27.2 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. టాప్ 20 కస్టమర్ల నుంచి వ్యాపారం పెరగటంతో వృద్ధి ఆశించిన స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. మొత్తం ఆదాయంలో 56.50 శాతం అమెరికా నుంచి, 29.2 శాతం యూరప్ దేశాల నుంచి వస్తుందని తెలిపారు. ఆసియా, పసిపిక్-ఇతర దేశాల నుంచి 14.3శాతం లభిస్తోందని తెలిపారు. కాగా గురువారం బిఎస్ఇలో కంపెనీ షేరు 4.73 శాతం లాభంతో 346.85 రూపాయల వద్ద స్థిరపడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications