బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తి తిరిగి రావడంతో ఆ కంపెనీ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. దేశీయ ఐటిరంగ దిగ్గజ సంస్థల్లో ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ సంస్థ నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 21 శాతం పెరిగాయి. ఈ మేరకు ఇన్ఫోసిస్ శుక్రవారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
దేశీయ ఐటిరంగ సంస్థల ఎగుమతులకు కీలక మార్కెట్లైన అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు వ్యక్తమవుతుండటంతో ఔట్‌సోర్సింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ మధ్య ఇన్ఫోసిస్ రెవిన్యూ వృద్ధి ఔట్‌లుక్ సైతం ఎగబాకింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో నికర లాభం 2,875 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. కాగా అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో 2,369 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఇన్ఫోసిస్ నమోదు చేసింది.

ఆదాయం 25 శాతం పెరిగి 10,424 కోట్ల రూపాయల నుంచి 13,026 కోట్ల రూపాయలకు ఎగిసినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. మూడో త్రైమాసికం పనితీరు సంతోషకరంగా ఉందని ఇన్ఫోసిస్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌డి శిబులాల్ అన్నారు. 1.7 శాతం వృద్ధిని సాధించామని ఆయన తెలిపారు. రెవిన్యూ 2.1 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు. ఆన్‌సైట్ 3.4 శాతం పడిపోగా, ఆఫ్‌షోర్ మాత్రం ఏకంగా 2.6 శాతం పెరిగిందన్నారు. ఈ ఫలితాలు గత రెండు త్రైమాసికాల్లో తాము తీసుకున్న చర్యలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 54 మంది కొత్త క్లయింట్లు వచ్చారని చెప్పారు.
కాగా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికిగానూ రెవిన్యూ వృద్ధి అంచనాను 24.4 శాతం నుంచి 24.9 శాతానికి ఇన్ఫోసిస్ పెంచింది. ఇంతకుముందు ఇది 21-22 శాతంగా ఉండేది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల విలువ శుక్రవారం 2.73 శాతం పెరిగి 3,545.35 రూపాయలకు చేరుకుంది. ఇన్ఫోసిస్ రెవిన్యూ అంచనాలను అందుకోగా, లాభాలు మాత్రం మించిపోయాయని కొటాక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లైయింట్ గ్రూప్ రీసెర్చ్ అధిపతి దీపెన్ షా పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇన్ఫోసిస్ తాజా రెవిన్యూలో ఉత్తర అమెరికా నుంచి 60 శాతం, ఐరోపా దేశాల నుంచి 24.9 శాతం వచ్చింది. సంస్థ ఉద్యోగులు ఈ త్రైమాసికంలో 6,682 మంది పెరిగడం గమనార్హం.
మంచే జరగాలి: నారాయణ మూర్తి
ఇంతకుముందన్నడూ లేనివిధంగా సంస్థ నుంచి పెద్ద ఎత్తున సీనియర్లు వైదొలగారని.. వారందరికీ మంచే జరగాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ సంస్థలో సమర్థులకు కొదవ లేదని అన్నారు. గత ఏడాది జూన్‌లో నారాయణ మూర్తి సంస్థలోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రాకతో మదుపర్లలో ఇన్ఫోసిస్‌పట్ల విశ్వాసం మరింత పెరగగా, స్టాక్‌మార్కెట్‌లో సంస్థ షేర్ల విలువ కూడా భారీగానే పెరిగింది.
తన కుమారుడు రోహన్ కంపెనీలో ఉన్నత స్థానం కోసం తయారవుతున్నారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం రోహన్ హార్వర్డ్‌కు సెలవులు పెట్టారని, సరైన సమయంలో తిరిగి వెళతారని నారాయణమూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఏ స్థానంలో రోహన్ ఉంటాడనేది తాను నిర్ణయించేది కాదని తెలిపారు. అతని భవిష్యత్‌పై తాను నిర్ణయం తీసుకోవడం సరికాదని నారాయణమూర్తి పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications