
బాండ్లలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు సొమ్ము వెనక్కి చెల్లించినట్టుగా చెబుతున్న సహారా గ్రూప్ కంపెనీలు, అదే నిజమైతే చెల్లింపులకు అవసరమైన సొమ్ము ఎక్కడినుంచి తెచ్చాయో రెండు వారాల్లో వివరాలు వెల్లడించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. తాము సమీకరించిన సొమ్ము లో 90 శాతం సుమారు 20 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే వెనక్కి తిరిగి ఇచ్చేసినట్టుగా సహారా గ్రూప్‌నకు చెందిన రెండు రియల్టీ సంస్థలు కోర్టుకు తెలిపాయి.
అయితే ఈ 20 వేల కోట్ల రూపాయలను ఎలా పొందారో వివరాలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే, అయితే సొమ్ము ఎలా సమీకరించారో బ్యాలెన్స్‌షీట్లలో వివరంగా ఉండాలని పేర్కొంది. సొమ్ము ఎలా సమీకరించారో వివరాలు కనుక్కునేందుకు ఆర్ఒసిని తాము పిలిచి అడుగుతామని, అవసరమైతే మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని జస్టిస్ రాధాకృష్ణన్ చెప్పారు. కోర్టు నిస్సహాయురాలు కాదని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఇన్వెస్టర్ల డబ్బు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
తమ ఆదేశాలు పూర్తిగా అమలయ్యేలా చూస్తామనిని న్యాయమూర్తి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. తొమ్మిది నెలల క్రితమే సహారా కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ సెబి కోర్టు ధిక్కారనేరం కింద పిటిషన్ వేసిన విషయం కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. సుప్రీం కోర్టు ఆమోదిస్తే తప్ప సెబీ కోరిన ఏ సమాచారాన్ని సహారా గ్రూపు సంస్థలు అందజేయడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని జస్టిస్ ఖేర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు మరో ఘనత
విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెండ్-ఆర్ఐఎన్ఎల్) మరో ఘనతను సొంతం చేసుకుంది. పని ప్రదేశ యాజమాన్య నిర్వహణ వ్యవస్థ- వర్క్ ప్లేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి ‘5ఎస్' ధ్రవీకరణ పత్రం సాధించింది. మన దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పత్రం పొందిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనతను సాధించింది.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వాణిజ్యంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా పరిశ్రమల్లోని పని ప్రదేశాల్లో సమర్థవంతమైన యాజమాన్య నిర్వహిణకు గానూ జపాన్ దేశం 5 ఎస్ ను ధ్రువీకరణ పత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఘనత తమ పరిశ్రమ సొంతం చేసుకోవడం పట్ల విశాఖ ఉక్కు కర్మాగారం ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. మధుసూదన్ ఆనందం వ్యక్తం చేస్తూ.. కర్మాగారంలోని అధికారులు, కార్మికులకు అభినందనలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications