ఫ్రాన్స్ సంస్థ చేతికి తిరుమల డెయిరీ: ఫెడ్‌కి లేడీ బాస్

వాటాల కొనుగోలు కోసం రూ. 1,750 కోట్ల (275 మిలియన్ డాలర్లు) వరకు ఆ సంస్థ వెచ్చించనున్నట్లు సమాచారం. ఈ మేరకు తిరుమల డెయిరీ, లే గ్రూప్ లాక్టలిన్ సంస్థల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. పాలు, దాని సంబంధిత ఉత్పత్తులకు భారతదేశంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ సంస్థ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫెడరల్ రిజర్వుకు మహిళా బాస్
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వు పగ్గాలు శతాబ్ద కాలంలో తొలిసారిగా ఓ మహిళ చేతికి అందాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్సపర్సన్‌గా జానెట్ ఎలెన్ నియమితులయ్యారు. జానెట్ ఎల్లెన్ నియమాకానికి అమెరికా సెనెట్ ఆమోదం లభించింది. దీంతో వందేళ్ల చరిత్రతోపాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సెంట్రల్ బ్యాంకుగా గుర్తింపు కలిగిన ఫెడరల్ రిజర్వ్‌కు మొట్టమొదటిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించనున్నారు.
67 ఏళ్ల ఎలెన్ ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఫెడ్ తీసుకున్న అసాధారణ చర్యల వెనుక ఎలెన్ కీలక పాత్ర పోషించారు. జనవరి 31న ప్రస్తుత ఛైర్మన్ బెర్నాంకే పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మంగళవారం ఎలెన్ నియమకానికి సెనెట్ ఆమోదం తెలిపిన అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడారు.
ఎలెన్ నాయకత్వంలో అమెరికా ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతం కాగలరని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ఎలెన్ సారథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక విధానాలు, లక్ష్యాలు ఉంటాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఫెడ్‌లో దశాబ్దకాలంగా పనిచేస్తున్న ఎలెన్ అమెరికాను మాంద్యం నుంచి గట్టెక్కించడంలో సహాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications