న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఇప్పటికీ భారత్ సురక్షితమేనని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ స్పష్టం చేశారు. అయితే అంతకంటేముందు దేశ ఆర్థిక వ్యవస్థపై భారతీయ పారిశ్రామికవేత్తలు పూర్తి విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడే విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్లోకి రాగలవని సచిన్ పైలట్ ఆదివారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రస్తుతం స్థిరమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులున్నాయని ఆయన అన్నారు. మొదట దేశంలోని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు రావనే అపోహను తొలగించుకోవాలని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠిగా ఉందనే విశ్వాసం ముందుగా ఇక్కడి కార్పొరేట్ వర్గాల్లో ఉన్నట్లైతే వారు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని అన్నారు. అప్పుడు విదేశీ పెట్టుబడులు సైతం వాటంతటవే దేశీయ మార్కెట్లోకి తరలి వస్తాయని సచిన్ పేర్కొన్నారు.

ఐరోపా దేశాలతోపాటు జపాన్, చైనా దేశాలను చూసినట్లైతే అక్కడి కార్పొరేట్లు ఆయా దేశాల్లో పెట్టుబడులను విస్తృతంగా పెడతారని, ఆ తరహా విశ్వాసం భారతీయ కార్పొరేట్ వర్గాల్లో కనిపించడం లేదని తెలిపారు. కాబట్టి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.
2013 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో వృద్ధిరేటు గత ఏడాదితో పోల్చితే 5.3 శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయిన క్రమంలో భారత్‌లో తమ పెట్టుబడులకు తగిన వాతావరణం లేదన్న అభిప్రాయానికి విదేశీ మదుపర్లు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. వృద్ధిరేటు బలోపేతానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకున్న నిబంధనలను సడలిస్తున్నామని, కార్పొరేట్ రంగానికి వెన్నుదన్నుగా కొత్త కంపెనీల చట్టాన్ని తెచ్చామని, రెగ్యులెటరీ వ్యవస్థల్లోనూ మార్పులు తీసుకొస్తున్నామని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
జస్ట్ డయల్‌లో అమితాబ్ షేర్ల విలువ రెట్టింపు
జస్ట్ డయల్ కంపెనీ షేర్ల ర్యాలీ కొనసాగడంతో ఆ కంపెనీలో అప్పటికే షేర్లు కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పెట్టుబడుల విలువ రెట్టింపుకు పైగా పెరిగింది. కేవలం ఏడు నెలల్లోనే అమితాబ్ షేర్ల విలువ రూ. 3.83 కోట్ల నుంచి 10.06 కోట్లకు చేరుకుంది. ఆ కంపెనీ షేర్లు ప్రస్తుతం 161 శాతం లాభాలను నమోదు చేయడం గమనార్హం.
2013, జూన్ 5న ఆ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదు కాగా, ఆ సమయంలో కంపెనీ స్ర్కివ్ ధర రూ. 611. 45. అయితే ప్రస్తుతం జనవరి 3వ తేదీన రూ. 1603.5కి చేరుకుని గరిష్టంగా 1,648ను తాకడం విశేషం. కాగా జస్ట్ డయల్ కంపెనీ అమితాబ్ ప్రచార కర్తగా కూడా ఉన్నారు. 2010 డిసెంబర్ నుంచి మూడేళ్ల పాటు కొనసాగేలా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2011లో 62, 794 షేర్లను ఒక్కో షేరుకు రూ. 10 ముఖ విలువ చెల్లించి అమితాబ్ ఆ కంపెనీలో వాటాలను కొనుగోలు చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications