కారు, గృహ రుణ మేళ ప్రారంభించిన ఎస్‌బిహెచ్

ఈ మేళాలో భాగంగా కార్ల రుణాలపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 10.40 శాతానికే ఇస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ కాలంలో ప్రాసెసింగ్ ఛార్జీల్లో 0.25 శాతం మినహాయింపును కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా 30 ఏళ్ల కాలపరిమితి గల గృహ రుణాలపై కస్టమర్లు ప్రతి లక్ష రూపాయలకు నెలకు (ఇఎంఐ) 892 రూపాయల వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అలాగే ఏడేళ్ల కాలపరిమితి గల కార్ల రుణాలపై ప్రతి లక్ష రూపాయలకు నెలకు 1,681 రూపాయల వడ్డీని కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. గృహరుణం అయితే రూ. 75 లక్షల లోపు 10.20 శాతం, రూ. 75 లక్షల కంటే పైన అయితే 10.30 శాతం వడ్డీరేటుకు ఇస్తున్నట్లు ప్రాసెసింగ్ ఛార్జీలో 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించింది.
150 రోజుల డిపాజిట్ కొనసాగింపు
ఖాతాదారుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఎస్‌బిహెచ్ 150 రోజుల డిపాజిట్ పథకం కాలపరిమితిని పొడిగించినట్లు బ్యాంకు వెల్లడించింది. జనవరి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఎస్‌బిహెచ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications