తెలుగోడికి విశాఖ ప్లాంట్ బాధ్యతలు

చౌదరి స్థానంలో మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు. మధుసూదన్ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా 2009లో బాధ్యతలు స్వీకరించి, ఆ శాఖలో గణనీయమైన ప్రగతిని కనబరిచారు. ముఖ్యంగా ఈ-పేమెంట్ విధానాన్ని మధుసూదన్ అమలు చేశారు. ప్రస్తుతం సంవత్సరానికి 3.6 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధిస్తున్న విశాఖ ప్లాంట్, మరో ఆరు నెల్లో 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించనుంది. కాగా మధుసూదన్ హయాంలోనే 11 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించి మహారత్న హోదాను దక్కించుకునే అవకాశాలున్నాయి.
ఇప్పటికే విశాఖ ప్లాంట్ నవరత్న హోదాను కలిగి ఉంది. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మధుసూదన్ మాట్లాడారు. 2014 సంవత్సరం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సువర్ణ అధ్యాయం అవుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ రెండో దశ ఉత్పత్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించుకోవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే స్టీల్ విక్రయాల్లో లాభాలు చాలా తక్కువగా వస్తున్నందున, కర్మాగారంలో ఖర్చులు కింది స్థాయి నుంచి తగ్గించుకోవాలని మధుసూదన్ అధికారులను కోరారు. కలిసికట్టుగా పనిచేసి, నాణ్యమైన స్టీల్ ఉత్పతిని సాధించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో సిఎండిగా నియమితులైన తెలుగువారిలో మధుసూదన్ మూడో వ్యక్తి కావడం విశేషం. 2004 నుంచి 2007 వరకు వై శివసాగర్‌రావు మూడేళ్ల కాలానికి సిఎండి సేవలందించారు. మరో తెలుగువారు సి అప్పారావు 11 రోజులపాటు సిఎండిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.


Click it and Unblock the Notifications