మహిళల కోసం మైక్రోసాఫ్ట్ ‘గార్డియన్’(పిక్చర్స్)

హైదరాబాద్ : మహిళల భద్రతకు ఎంతగానో దోహదపడే మొబైల్ అప్లికేషన్ (యాప్)ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా దీనిని రూపొందించామని మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ బియానీ తెలిపారు.

నిర్భయ సంఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం తన వంతుగా ఏమైనా చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుందని, ఇందులో భాగంగానే ఈ అప్లికేషన్ అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. తమ ఉద్యోగులు రోజువారీ పని గంటలు పూర్తి చేసిన తర్వాత అదనంగా సమయాన్ని వెచ్చించి ఈ అప్లికేషన్ కోసం శ్రమించారని, దీని అభివృద్ధికి ఆరు నెలల సమయం పట్టిందని బియానీ చెప్పారు.

హైదరాబాద్‌లోని కేంద్రంలోనే ఈ గార్డియన్ అప్లికేషన్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. కొన్ని నెలల పాటు తమ సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ గార్డియన్ అప్లికేషన్‌ను వినియోగించి, సంతృప్తి చెందాకే అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని బియానీ తెలిపారు.

'గార్డియన్' ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి... విండోస్ ఫోన్ వినియోగదారులు విండోస్ స్టోర్ నుంచి గార్డియన్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రాజ్ బియానీ తెలిపారు. ఇబ్బందుల్లో పడిన సమయంలో ఎవరికి సమాచారం అందించాలో వారి మొబైల్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్‌లను అప్లికేషన్ సెట్టింగ్‌లోకి వెళ్లి నమోదు చేయాలని తెలిపారు.

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

విండోస్ మొబైల్ ఫోన్ మహిళల భద్రతకు ఎంతగానో దోహదపడే మొబైల్ అప్లికేషన్ (యాప్) అందుబాటులోకి వచ్చింది. 'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది.

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఇబ్బందుల్లో పడిన సమయంలో ఎవరికి సమాచారం అందించాలో వారి మొబైల్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్‌లను అప్లికేషన్ సెట్టింగ్‌లోకి వెళ్లి నమోదు చేయాలని మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ బియానీ తెలిపారు.

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. తెలియని ప్రదేశంలో చిక్కుకుపోయినా, అపహరణకు గురైన సందర్భంలో ఈ అప్లికేషన్‌లోని 'ట్రాక్ మీ' బటన్‌ను నొక్కడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు బాధితురాలు ఎక్కడ ఉన్నదీ గుర్తించేందుకు వీలవుతుందని బియానీ తెలిపారు.

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా ఒకే టచ్‌తో వాయిస్‌నే కాకుండా వీడియోను రికార్డు చేయవచ్చని, ఫొటోలు కూడా తీయవచ్చని పేర్కొన్నారు. వీటిని తర్వాతి కాలంలో సాక్ష్యాల కోసం ఉపయోగపడతాయని తెలిపారు.

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

గార్డియన్ యాప్ ఆవిష్కరణ

'గార్డియన్' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త అప్లికేషన్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. గార్డియన్ యాప్ కలిగిన మొబైల్‌ను చూపుతున్న యువతి.

తెలియని ప్రదేశంలో చిక్కుకుపోయినా, అపహరణకు గురైన సందర్భంలో ఈ అప్లికేషన్‌లోని 'ట్రాక్ మీ' బటన్‌ను నొక్కడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు బాధితురాలు ఎక్కడ ఉన్నదీ గుర్తించేందుకు వీలవుతుందని బియానీ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్‌లోని 'ఎస్ఒఎస్' అలర్ట్ బటన్‌ను నొక్కడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్, ఆస్పత్రులకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఇదే సమయంలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లకు సంక్షిప్త సందేశంతోపాటు లొకేషన్ వివరాలు చేరిపోతాయని చెప్పారు.

సంబంధిత సమాచారం ఇ-మెయిల్స్‌కు వెళ్లడంతోపాటు రిజిస్టర్ చేసిన ప్రైవేట్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో అప్‌డేట్ అవుతుందని, దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్నవారి సమాచారం అందరికీ తెలిసిపోతుందని వివరించారు.

ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినప్పుడే ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక సారి కనెక్ట్ అయిన తర్వాత మొబైల్ ఫోన్ పని చేయని విధంగా పగిలిపోయినా.. అది ఎక్కడ ఉన్నదీ గుర్తించవచ్చని బియానీ చెప్పారు. విండోస్ అజ్యూర్ క్లౌడ్ సర్వీసులు, బింగ్ మ్యాప్ ఎపిఐలను గార్డియన్ వినియోగించుకుంటుందని తెలిపారు.

ఈ అప్లికేషన్ ద్వారా ఒకే టచ్‌తో వాయిస్‌నే కాకుండా వీడియోను రికార్డు చేయవచ్చని, ఫొటోలు కూడా తీయవచ్చని పేర్కొన్నారు. వీటిని తర్వాతి కాలంలో సాక్ష్యాల కోసం ఉపయోగపడతాయని తెలిపారు. ఒంటరిగా వెళ్లే సమయాల్లో మహిళలకు భద్రత కల్పించేందుకు ఈ అప్లికేషన్ ఉపకరిస్తుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+