
అలాంటి రోజువారీ ఆరోగ్య బీమా అనుబంధ పాలసీలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆస్పత్రి నగదు ప్రణాళిక ఒక సాధారణ ఆరోగ్య బీమా ప్రణాళికలో అనుబంధం చేయబడి కూడా అందుబాటులో ఉంది.
పాలసీ హైలైట్స్
మీరు ఆస్పత్రి పాలైన సందర్భంలో ఈ ఆస్పత్రి నగదు విధానం ద్వారా రోజువారీగా చెల్లింపులు జరుగుతాయి. అంతేకాకుండా మెడికల్ ఖర్చులతోపాటు ఇతర ఖర్చులకు కూడా ఈ విధానంలో చెల్లింపులు చేయడం జరుగుతుంది. నగదు పాలసీ విధానంలో మూడు ముఖ్యమైన అంశాలుంటాయి. అవి అర్హత, రోజువారీ భత్యం పరిమితి, కవరేజ్‌ను కొన్ని రోజుల వరకు విస్తరింపజేయవచ్చు.
అర్హత(ఎలిజిబిలిటి): ఇతర పాలసీలలో 48 గంటలు ఆస్పత్రిలో ఉంటే తప్ప ఆరోగ్య బీమా చెల్లింపులను జరపవు. అయితే ఆస్పత్రి నగదు పాలసీలో కనీసం 24గంటలపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లయితే మీకైనా ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది.
రోజువారీ భత్యం పరిమితి: సాధారణంగా పాలసీ విధానంలో ఎక్కడైనా రూ. 500 నుంచి 3000 వరకు రోజువారీగా చెల్లించడం జరుగుతుంది. ఒక వేళ వేరే సందర్భంగా బీమాదారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అడ్మిట్ అయినట్లయితే ఈ రోజువారీ చెల్లింపులను పెంచే అవకాశం ఉంటుంది. అయితే రోజువారీ చెల్లింపులు పెంచిన సందర్భంలోనే ఆస్పత్రిలో చెల్లింపులు జరిపే రోజులను తగ్గించేస్తుంది. అంటే ఉదాహరణకు ఒక ఏడాదిలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన నెల రోజులకు చెల్లింపులు జరిపేందుకు బీమా పాలసీ తీసుకున్నరానుకుంటే.. వాటిని చెల్లింపులు పెంచిన సమయంలో 15 రోజులకు తగ్గించడం జరుగుతుంది. అంటే పాలసీదారు ఒక వేళ ఐసియూలో చికిత్స చేసుకున్నట్లయితే రోజువారీ ఖర్చును పెంచి, రోజులను తగ్గించడం జరుగుతుంది.
ఇతర విషయాలు
సాధారణ బీమా విధానం మాదిరిగానే ఆస్పత్రి నగదు పాలసీలో కూడా వైద్య పరిస్థితులకు ముందుగా గానీ, తర్వాత గానీ వేచిచూడాల్సిన సమయం ఒకేలా ఉంటుంది. సాధారణంగా ఆస్పత్రి నగదు విధారం రోజువారీ సంరక్షణ వైద్య పద్దతులకు బీమా రక్షణను వర్తింపచేయలేవు. బీమా సంస్థ నుంచి మీరు ఏయే సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను పొందదల్చుకున్నారో ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఆస్పత్రి నగదు పాలసీ ద్వారా ఆస్పత్రి పాలైన సందర్భాల్లోనే రోజువారీ ప్రాతిపదికన భత్యాలను పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన రుజువులను చూపించి చికిత్స అనంతరం అయిన మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications