
ఐఎస్‌జిలో జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు 27.55 శాతం వాటా ఉండగా, దాని అనుబంధ సంస్థ జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఓవర్‌సీస్ లిమిటెడ్‌కు మరో 12.45 శాతం వాటా ఉంది. కాగా మంగళవారం ఎంఎహెచ్‌బి మలేసియా స్టాక్ ఎక్చేంజిలో ఈ వివరాలను నమోదు చేసింది. జిఎంఆర్ వాటాను 225 మిలియన్ యూరోల(రూ.1,900 కోట్లు)కు కొనుగోలు చేయనున్నట్లు మలేసియా కంపెనీ వెల్లడించింది. టర్కీకి చెందిన లైమక్ కన్‌స్ట్రక్షన్ హోల్డ్స్‌కు మరో 40 శాతం వాటా ఉంది.
దీర్ఘకాలిక నిర్ణయాలతో మనుగడ
హైదరాబాద్: పరిశోధనే ప్రాణంగా డాక్టర్ అంజిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమించారని, ప్రపంచానికి ఒక అద్భుత ఔషధ కంపెనీని అందించారని డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్ చైర్మన్, సిఇఒ జివి ప్రసాద్ పేర్కొన్నారు. ఖరీదైన ఔషధాలు తక్కువ ధరకే అందించడం, ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా 1984లో అంజిరెడ్డి కంపెనీని ప్రారంభించారని ఆయన తెలిపారు. ‘ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)' మంగళవారం యార్లగడ్డ శ్రీరాములు పదో ధర్మనిధి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సంస్థ మెరుగైన వృద్ధితో మనుగడ సాగించగలుగుతుందనిఅయితే ఇలాంటి నిర్ణయాల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతాయని, వాటిని తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రసాద్ అన్నారు. 25 లక్షల రూపాయల మూలధనంలో ప్రారంభమైన డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్.. డాక్టర్ అంజిరెడ్డి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని తెలిపారు.
పరిశోధనా, అభివృద్ధి, నూతన ఔషధాల ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టి క్రమంగా వృద్ధి బాటలో సాగినట్టు ప్రసాద్ చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటూ సంక్షిష్టమైన ఔషధాలను సైతం అందుబాటులోకి తెచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో మాలక్ష్మీ చైర్మన్ వై హరీశ్చంద్ర ప్రసాద్, ఐఈఐ ఛైర్మన్ జి. సుధాకర్, కార్యదర్శి కమలాకర్, రాధాకృష్ణమూర్తితోపాటు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications