
ఉపాధి పెట్టుబడులపై ఆదాయాన్ని (ఆర్ఓసిఈ) బట్టి కంపెనీలు తమ ఆర్థిక వనరులను ఏ మేరకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. ఒక వేళ ఓ కంపెనీ భారీ మొత్తంలో రుణాలను పొందినట్లయితే ఆ కంపెనీ లాభాల నిష్పత్తిలో పెరుగుల నమోదు చేసుకోలేకపోతోంది. కార్పొరేట్ స్థాయిని నిర్ణయించడంలో ఉపాధి పెట్టుబడులపై ఆదాయం అనేది కీలకమైన అంశమని అమితాబ్ క్యాపిటల్, ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సౌరభ్ ముఖర్జీ అన్నారు. అన్ని కార్పొరేట్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు.
ఆర్థికాభివృద్ధి కారణంగా భారత కంపెనీలు 2009 వరకు అధిక మొత్తంలో మూలధన ఆదాయాలను పొందినట్లు ఆయన తెలిపారు. అయితే 2008లో సంభవించిన లేమాన్ సంక్షోభం కారణంగా ఆదాయ నిష్పత్తి పెరుగుదలలో క్షీణత ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో మళ్లీ ఆర్థి వృద్ధిలో పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉందని అన్నారు.
అయితే కంపెనీల తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించడం, అనవసరంగా ఇతర కంపెనీలలో కలిసిపోవడం, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం లాంటివి కొంత ఆందోళనకరంగా ఉన్నాయని ముఖర్జీ తెలిపారు. కొన్ని కంపెనీలు అనవసర విలీనాలు, కొనుగోళ్లు చేయడం ద్వారా తమ నాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పాలసీలు కొంత మేరకు సహకరిస్తున్నప్పటికీ, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఆందోళనకరంగా ఉంటున్నాయని తెలిపారు.
గత ఐదు సంవత్సరాల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు తమ మూలధన ఆదాయాలను పెంచుకునేందకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. రుణ పరిమితిని తక్కువగా లేదా సున్నా స్థాయిలో కలిగి ఉన్న ఈ కంపెనీలు ఎక్కువ లాభాలను పొందాయి. వాటిలో క్యాస్ట్రల్ ఆర్ఓసిఈ 104.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో టైట్ ఇండస్ట్రీస్ కూడా 59.4శాతం లాభాల పెరుగుదలను నమోదు చేసింది.
ప్రతికూల పరిస్థితుల్లో రుణస్థాయిలను తగ్గించుకోవడం ద్వారా ఈ కంపెనీలు లాభాలను ఆర్జించాయని ఏఎస్‌కె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ షా తెలిపారు. మార్కెట్ విలువలో పెరుగుదల 89శాతం వృద్ధి నమోదు కాగా, భారత కంపెనీలు 30శాతం మాత్రమే మూలధన ఆదాయాలను పెంచుకోగలిగాయాని చెప్పారు. 15 నుంచి 30 సగటు రాబడితో కంపెనీలు తమ లాభాలను 38శాతం మార్కెట్ విలువను కలిగి ఉండే అవకాశం ఉదని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications