
ల్యాంకో కొండపల్లి ప్లాంటులో విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేయటంతో పెద్ద ఎత్తున విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా కార్బన్ పాయింట్లను గెలుచుకోగలిగినట్లు పాండురంగా రావు తెలిపారు. ఎన్నో పొదుపు చర్యలు పాటించిన ఫలితంగా ల్యాంకో కొండపల్లి ప్లాంట్ జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని దక్కించుకోగలిగిందని పాండు రంగారావు పేర్కొన్నారు.
రూ.23.7 కోట్లు పలికిన భారతీయ పెయింటింగ్
ప్రముఖ భారతీయ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌కు రికార్డు స్థాయి ధర పలికింది. అంతర్జాతీయ వేలం నిర్వహణ సంస్థ క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో చిత్రాకరుడు వాసుదేవ్ గైతొండె వేసిన చిత్రానికి ఏకంగా 23.7 కోట్ల రూపాయలు పలికింది. భారత్‌లో తాము నిర్వహించిన మొదటి వేలానికే అపూర్వ స్పందన లభించిందని, త్వరలో లేదా వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ మరో వేలంను నిర్వహించనున్నట్లు క్రిస్టీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవెన్ ముర్ఫి పేర్కొన్నారు.
ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయడానికి కళాభిమానులు పోటీపడ్డారని తెలిపారు. ఈ చిత్రానికి వేలాన్ని ప్రారంభించిన మొదటి మూడు నిమిషాల్లోనే 13 కోట్ల రూపాయల ధర పలికిందని, ఒక్కోసారి బిడ్డింగ్ ధర 50 లక్షల రూపాయల మేర పెరిగిందని ఆయన చెప్పారు. ఇలా జోరుగా ధర పెరుగుతూ 20 కోట్ల రూపాయల స్థాయికి చేరుకోగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిందని ముర్ఫీ తెలిపారు. చివరకు 20.5 కోట్ల రూపాయల వద్ద వేలాన్ని పూర్తి చేశామని, అమెరికాకు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గైతొండె చిత్రాన్ని కైవసం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications