
బుధవారం జరిపిన మధ్యంతర త్రైమాసిక ద్రవ్యసమీక్షలో సమీక్షలో ద్రవ్యోల్బణం కట్టడికి రెపో రేటును ఆర్‌బిఐ పావు శాతం పెంచుతుందన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ రెపో రేటును గతంలో నిర్ణయించిన 7.75 శాతం వద్దే ఉంచారు. అదే విధంగా నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ను సైతం 4 శాతం వద్దే కొనసాగించారు. రాజన్ గతంలో రెండు పర్యాయాలు వడ్డీరేట్లను పెంచిన విషయం విధితమే.
అంతేగాక ఈసారి వడ్డింపులు తప్పదన్న అభిప్రాయాలు ఉండటంతో గృహ, ఆటో ఇతర రుణాల నెలసరి చెల్లింపులు భారమయ్యే వీలుందని భయపడినవారందరికీ ఆర్‌బిఐ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించిన సందర్భంగా రఘురాం రాజన్ మాట్లాడారు. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం వల్ల గృహ రుణాలు, వాహన రుణాలు తీసుకున్న సామాన్యులపై నెలవారీ సమానవాయిదా (ఈఎంఐ)ల భారం పెరగదని రాజన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజన్ పేర్కొన్నారు.
వ్యవసాయం, ఎగుమతులు పుంజుకోవడంతోపాటు, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో కదలికల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధిరేటు పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఆర్‌బిఐ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. పరిశ్రమలకు ఆర్థిక చేయూతతోపాటు వృద్ధిరేటు బలోపేతానికి ఆర్‌బిఐ చర్య దోహదం చేయనుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.
వచ్చే ఏడాది 16వేల ఉద్యోగాల నియామకం
దేశీయ ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది 16,000 మంది ఇంజినీర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనుందని ప్రకటించింది. బుధవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలైందని, వచ్చే ఏడాది 16వేల ఇంజినీర్ల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌బిఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఆరు రోజుల తర్వాత 305 పాయింట్ల లాభంతో ముగిసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications