ఆఫర్: సింగపూర్‌కు చౌక ప్రయాణం

కాగా ఇరు సంస్థలు సోమవారం హైదరాబాద్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, టైగర్ ఎయిర్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అలెగ్జాండర్ క్నిగె మాట్లాడారు. రెండు దేశాల మధ్య ప్రయాణించేవారికి ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. 14 నగరాల నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులను స్పైస్‌జెట్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువస్తుందని, ఇక్కడి నుంచి వారు టైగర్ ఎయిర్ ద్వారా సింగపూర్‌కు చేరుకోవచ్చని సంజీవ్ కపూర్ పేర్కొన్నారు.
ఈ నగరాల్లో తిరుపతి, విశాఖపట్నం, పుణె, చెన్నై, కోయంబత్తూరు, మదురై, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, కోల్‌కతా, ఢిల్లీ, గోవా, ఇండోర్, మంగళూరు ఉన్నాయని తెలిపారు. ఇంతకు ముందు విభిన్న నగరాల నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ రావడానికి, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్లడానికి రెండు టికెట్లను కొనడంతోపాటు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని, తమ భాగస్వామ్యం నేపథ్యంలో ఒకే టికెట్‌పై ప్రయాణికులు ఇబ్బంది లేకుండా సింగపూర్ చేరుకోవచ్చని ఆయన చెప్పారు.
జనవరి 6 నుంచి స్పైస్ జెట్ విమానాల ద్వారా దేశీయ ప్రయాణికులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. టైగర్ ఎయిర్‌వేస్ జనవరి 12 నుంచి ఇదే విధమైన ప్రయాణానికి అనుమతిస్తుందని తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రారంభ ఆఫర్‌గా 4,699 రూపాయలకే సింగపూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నామని, తిరిగి వచ్చేటప్పుడు పన్నులతో కలిపి టికెట్ ధర 9,998 రూపాయలుగా ఉంటుందని చెప్పారు. ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమేనని ఇరు సంస్థలూ ప్రకటించాయి.


Click it and Unblock the Notifications