
నిరుడు ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది జులై 31 వరకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ సూచించిన 140కి పైగా అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించిన సంస్థలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. మన దేశంలో ఈ పురస్కారం అందుకున్న తొలి విమానాశ్రయం హైదరాబాద్ ఎయిర్ పోర్టేనని ఆయన తెలిపారు. కాగా ఇటీవల లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఒబిఈ ఛైర్ పర్సన్ లిండా ఆర్మ్ స్ట్రాంగ్ చేతుల మీదుగా జిహెచ్ఐఏఎల్ సిఈఓ ఎస్‌జికె కిషోర్ ఈ అవార్డును అందుకున్నారు.
నాబార్డ్ చైర్మన్‌గా హర్ష్‌కుమార్ నియామకం
న్యూఢిల్లీ: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా హర్ష్ కుమార్ భన్‌వాలాను ప్రభుత్వం నియమిస్తున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాబార్డ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రకాశ్ భక్షి సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్నేహలత నాబార్డ్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా హర్షకుమార్ భన్‌వాలా కుమార్ ప్రస్తుతం ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన చీఫ్ జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. నాబార్డ్‌లో కూడా గతంలో హర్ష్‌కుమార్ పలు అధికారిక పదవులు నిర్వహించారు.


Click it and Unblock the Notifications