హైదరాబాద్‌లో హిటాచీ గ్లోబల్ సెంటర్

రానున్న రోజుల్లో తమ వ్యాపారంలో భారత్ కీలక భూమిక పోషిస్తుందని జపాన్ కంపెనీకి అవసరమైన సహకారం కూడా ఇక్కడి నుంచే అందుతుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, చెన్నైలలో గ్లోబల్ డెవలప్ సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. పుణెలోనూ చిన్న కేంద్రం ఉందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 110 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అది 2015 నాటికి 500కు చేరుతుందని, అందులో హైదరాబాద్‌లోనే 300 మంది ఉంటారని ఆయన చెప్పారు.
జపాన్ సంస్థ హిటాచీ సొల్యూషన్స్ అంతర్జాతీయ క్లయింట్ల కోసం చైనాలో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా తాము చైనాకు ప్రత్యామ్నాయ స్థావరాల కోసం చేసిన అన్వేషణలో భారత్‌ను కీలక కేంద్రంగా ఎంచుకున్నట్టు ఆయన చెప్పారు. హిటాచీ వార్షికరాబడి 1900 కోట్ల డాలర్లలో సొల్యూషన్స్ డివిజన్ వాటా 20 శాతం ఉంటుందని ఆయన
పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా వ్యాపార విస్తరణకు హైదరాబాద్ అన్నివిధాల అనుకూలమైన నగరమని హిటాచీ సొల్యూషన్స్ ఇండియా సిఇఒ అనంత సుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో వ్యాపారాలపై రాజకీయ ఉద్యమాల ప్రభావం ఏమాత్రం లేదని అన్నారు. ఇండియాలో గ్లోబల్ సెంటర్స్ అమెరికా, యూరప్, బ్రిటన్, ఆసియా పసిఫిక్‌లోని క్లయింట్లకు అవసరమైన సర్వీసులను అందజేయడంతో పాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెడతాయని ఆయన చెప్పారు.
భారత్‌లోని తమ డెవలప్‌మెంట్ కేంద్రాలు పూర్తిగా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎఎక్స్, ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం టెక్నాలజీల ఆధారంగా వివిధ పరిశ్రమలు, సర్వీసుల రంగాలకు అవసరమైన ఐటి సొల్యూషన్స్‌ను డెవలప్ చేస్తాయని ఆయన వివరించారు. డైనమిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 620 కోట్లు) వ్యాపారం చేస్తున్నామని, 2015 నాటికి 600 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 3,700 కోట్లు) చేయాలన్నది తమ లక్ష్యంగా వివరించారు. ఈ సమావేశంలో హిటాచీ సొల్యూషన్స్ అమెరికా ప్రెసిడెంట్ మసకజు కుజితోపాటు సిఒఒ మెక్ గిలీస్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications