
బుధవారం వర్తక, వాణిజ్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమిలో సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సేవా పన్ను స్వచ్ఛంద చెల్లింపుల ప్రోత్సాహక పథకం విసిఇఎస్ ఓ సువర్ణావకాశంగా అభివర్ణించిన ఆయన, రాబోయే 20 సంవత్సరాల్లో మళ్లీ ఇలాంటి పథకం రాబోదన్నారు. ఈ పథకం ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సేవా పన్నును చెల్లించాలని అన్నారు. ఇంతకాలం సేవా పన్నును చెల్లించని వర్తకులు డిసెంబర్ 31వ తేదీలోగా చెల్లించాలన్నారు.
ఇటువంటి పథకాన్ని 1997లో అమలు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సేవా రంగంలో దాదాపు 17 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పేర్లను నమోదు చేసుకున్నారని, కాని ఏడు లక్షల మంది మాత్రమే పన్నులను చెల్లిస్తున్నారని మరోమారు పునరుద్ఘాటించారు. మిగిలిన 10 లక్షల మంది సేవా పన్నును చెల్లించడం లేదని తెలిపారు. వీరిని నో ఫైలర్స్, స్టాప్ ఫైలర్స్‌గా పరిగణించనున్నట్లు చెప్పారు.
భారత జిడిపిలో సేవా రంగానికి 57 శతం వాటా ఉందని చిదరంబంర తెలిపారు. కాగా, పన్ను ఎగవేతదారులపై తమ శాఖ నిఘావేసి ఉందని, వారి కార్యకలాపాలను ఒక కంట కనిపెడుతూనే ఉంటామని పేర్కొన్నారు. విసిఈఎస్ స్కీమ్‌ను ఉపయోగించుకుంటే సరే, లేదంటే డిఫాల్టర్లపై చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జెడి శీలం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications