యానిమేషన్, గేమింగ్ సిటీగా హైదరాబాద్

ఈ విధానం ప్రకారం గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని కంపెనీలకు ప్రభుత్వం స్థలం కేటాయించాలంటే ఆయా సంస్థలు హైదరాబాద్ నగరంలో అయితే 500 ఉద్యోగులను కలిగి ఉండాలి. ఇతర ప్రాంతాల్లో అయితే 150మంది ఉద్యోగులు ఉండాలి. అంతేకాకుండా భూమి కోసం దరఖాస్తు చేయడానికి ముందు రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. ప్రభుత్వం కేటాయించే ఒక్కో ఎకరానికి 500 మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది.
గేమింగ్, యానిమేషన్ తదితర రంగాల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ అకాడమీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఇలాంటి గేమింగ్ సిటీలే మరికొన్నింటిని రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్ పట్టణాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
అమ్మకాల్లో జోరు పెంచిన విశాఖ ఉక్కు
విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) 2013 ఏప్రిల్-నవంబర్ కాలానికి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు సంస్థ అధికారులు ప్రకటించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ముగిసే నాటికి 7,819 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్లు తెలిపారు. 519 కోట్ల విలువైన ఉక్కును విదేశాలకు ఎగుమతి చేసి 142 శాతం వృద్ధిని నమోదుచేసినట్లు వారు తెలిపారు. ఒక్క నవంబర్‌లోనే 2,36,838 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసిందని, ఇవన్నీ మెరుగైన పనితీరుకు అద్దం పడుతున్నాయని వైజాగ్ స్టీల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎపి చౌధురి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications