
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పరిస్థితులు మరింత మెరుగుపడతాయని, 5శాతం వృద్ధి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ చెల్లింపుల పరిస్థితి స్పష్టంగా మెరుగు పడిందని, త్రైమాసికంగా చూసినా, అర్ధ సంవత్సరం పరంగా చూసినా సిఎడి గణనీయంగా తగ్గిందని ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. సిఎడిని మరింతగా అదుపులోకి తెస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ. 40వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం చేరగలదన్న విశ్వాసాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. దీనికి తోడు కొన్ని మాసాలుగా ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోయిన ఉత్పత్తుల రంగం ఊర్థ్వముఖ కదలిక సాధించినట్టు హెచ్ఎస్‌బిసి ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) సూచిస్తుండగా ఆర్థిక రంగం ద్వితీయ త్రైమాసికంలో సాధించిన వృద్ధిరేటు పట్ల ప్రపంచ బ్యాంకు సంతృప్తిని వ్యక్తం చేసింది.
11 మందికి ఫోర్బ్స్ దాతృత్వ అవార్డులు
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తున్న కార్పొరేట్లకు ఫోర్బ్స్ ఇండియా దాతృత్వ అవార్డులు వరించాయి. నవంబర్ 29న బెంగళూరులో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వీరందరికీ అవార్డుల ప్రదానం జరిగింది. ఆర్గ్యమ్ వ్యవస్థాపకురాలు రోహిణి నిలేకని, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత సారథి నందన్ నిలేకనిలు 2013 సంవత్సరానికి ఔట్‌స్టాండింగ్ ఫిలాంత్రోపిస్ట్ కేటగిరీలో అవార్డులు అందుకున్నారు. గోద్రెజ్, బజాజ్ కుటుంబాలు ఔట్‌స్టాండింగ్ కార్పొరేట్ ఫౌండేషన్, ప్రముఖ ఫ్యామిలీ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి.
ధాతృత్వ అవార్డులు అవార్డులు రమేష్, స్వాతి రామనాథన్ (జనాగ్రహ వ్యవస్థాపకులు- క్రాసోవర్ లీడర్ అవార్డు), రోమేష్ వాధ్వాని (సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపక సిఎండి- ప్రముఖ నాన్ రెసిడెంట్ ఫిలాంత్రోపిస్ట్ అవార్డు), అర్చనా రఘురామ్ (కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ డైరెక్టర్- గుడ్ సమరిటన్ అవార్డు), నారాయణ హెల్త్ (గుడ్ కంపెనీ అవార్డు), అను ఆగా (థెర్మాక్స్ మాజీ చైర్‌పర్సన్- కార్పొరేట్ క్యాటలిస్ట్ అవార్డు), అమిత్ చంద్రా (బెయిన్ క్యాపిటల్ ఎండి-నెక్ట్స్‌జెన్ లీడర్ అవార్డు) లను వరించాయి.


Click it and Unblock the Notifications