పెట్టుబడులకు అత్యుత్తమం హైదరాబాదే: పొన్నాల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో నగరమైన హైదరాబాద్‌కు మౌలిక వసతుల రంగంలో చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు వేగంగా మెరుగుపడుతున్నాయని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనలో పేరెన్నికగన్నదని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఇన్ఫోసిస్ క్యాంపస్ నిర్మాణం పోచారంలో జరుగుతోందని, దీని ద్వారా 45వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఆదిభట్లలో నిర్మాణమవుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టిసిఎస్) ద్వారా 25వేల మందికి, వచ్చే రెండేళ్లలో విప్రో మరో 12వేల మందికి నూతనంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని పొన్నాల చెప్పారు.
హైదరాబాద్‌లో ఐటితోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని పొన్నాల తెలిపారు. 2030 నాటికి దేశంలోని పట్టణ జనాభా 590 మిలియన్లకు చేరుకుంటుందని, ఇందు కోసం మౌలిక వసతులు కల్పనకు రూ. 72 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయని ప్రధాని మన్మోహన్ సింగ్‌కి మెకెన్సీ సంస్థ ఓ నివేదిక ఇచ్చిందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications