హైదరాబాద్: వ్యాపార సంస్థలు తమ సొంత ప్రయోజనాలేకాకుండా సమాజ హిత కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంస్థ పోషకాహార లోపం ఉన్న పిల్లల్ని ఆదుకునేందుకు తన వంతుగా కృషి చేయనుంది.
ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. సమాజంలో అంతరాలు తగ్గించడానికి తమవంతుగా వ్యాపార సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని, దీని కోసం అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం అనేది కేవలం గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన సమస్యే కాదని, పట్టణాలు, నగరాల్లోనూ ఉందని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటని ఆయన తెలిపారు. టాటా గ్రూపు సంస్థలు తమ లాభాల్లో 4శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాయని ఆయన చెప్పారు.
పిల్లల్లో పోషకాహార లోపం భవిష్యత్తు తరాన్ని ప్రభావితం చేస్తుందని, యువతే మన దేశానికి ఉన్న గొప్ప శక్తి అని అనుకుంటున్న తరుణంలో ఆ యువత శక్తి హీనులుగా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. సమస్యను గుర్తించడమే కాకుండా, దాన్ని పరిష్కారానికి తనవంతుగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వం నుంచి ప్రజలకు నిధులు అందడం లేదని, మధ్యలోనే వృథా, దుర్వినియోగం ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో ప్రచార సాధనాలు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
పిల్లల్లో పోషకాహార లోపం తీవ్రమైన సమస్య అని, దీన్ని ఆరోగ్య అత్యయిక స్థితిగా పరిగణించాలని జిఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జిఎం రావు అన్నారు. జిఎంఆర్ గ్రూపునకు చెందిన స్వచ్ఛంద సంస్థ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా 185 అంగన్ వాడీ కేంద్రాలను దత్తత తీసుకొని, గర్భిణీలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇంపాక్ట్ అధ్యక్షురాలు సత్య రిథిమ పర్వతనేని మాట్లాడుతూ.. వార్టన్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ద ఇండియన్ ఇంపాక్ట్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. సామాజిక బాధ్యత కింద అంగన్ వాడీ కేంద్రాలను దత్తత తీసుకోదలచిన కార్పొరేట్ సంస్థలు తమ సంస్థ వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఐఎస్‌బి డీన్ అజిత్ రంగ్నేకర్, గూగుల్ డైరెక్టర్ అరిజిత్ సర్కేర్, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో రతన్ టాటా
శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా.

హాజరైన మహిళలు, విద్యార్థులు
శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, విద్యార్థులు.

రతన్ టాటాతో జిఎం రావు
శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా, జిఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జిఎం రావు, ఇంపాక్ట్ అధ్యక్షురాలు సత్య రిథిమ పర్వతనేని.

చిన్నారులతో టాటా
శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమంలో చిన్నారులతో ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా, జిఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జిఎం రావు, ఇంపాక్ట్ అధ్యక్షురాలు సత్య రిథిమ పర్వతనేని.

కార్యక్రమానికి టాటా
శుక్రవారం హైదరాబాద్‌లో ‘ద ఇండియన్ ఇంపాక్ట్' అనే సంస్థ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ రతన్ టాటా.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications