సంస్కరణలు తీసుకొస్తాం: చిదంబరం, మార్కెట్లోకి టాటా వైఫై

ఆర్థిక ప్రగతికి అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్లను, ఆర్థిక రంగాన్ని సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. చమురు, గ్యాస్ ధరలను నిర్ణయించామని, బొగ్గు రంగంలో చాలా సమస్యలను పరిష్కరించామని చెప్పారు. అందుకే మరింత బొగ్గును ఉత్పత్తి చేయగలుగుతున్నామని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఆర్థిక రంగం 6 శాతం వృద్ధి సాధించడం ఖాయమన్న విశ్వాశాన్ని ఆయన వ్యక్తం చేశారు.
లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఆకర్షణీయమైన లాభాలను ఆర్జించాయి. పటిష్టంగా ప్రారంభమైన సూచీలు మొదట్లో మరింత పెరిగి చివర వరకూ దాదాపు అదే స్థాయిలో కొనసాగాయి. మార్కెట్లకు బ్యాంకు షేర్లు అండగా నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండగలదన్న అంచనాలతో మదపర్లు కొనుగోళ్లు చేశారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 257.02 పాయింట్లు పెరిగి 20,791.93 పాయింట్ల వద్దకు చేరగా, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 84.25 పాయింట్లు వృద్ధి చెంది 6,176.10 వద్ద స్థిరపడింది.
టాటా డొకోమో నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ వై ఫై
ఫోటాన్ మాక్స్ పేరుతో హై స్పీడ్ ఇంటర్నెట్ వైఫై పరికరాన్ని టాటా డొకోమో ఫోటాన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. శుక్రవారం ఫోటాన్ మాక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా టాటా డొకోమో ఆంధ్రప్రదేశ్ యూనిట్ రాష్ట్ర అధిపతి ఎస్ రామకృష్ణ మాట్లాడారు. రూ. 1,999 విలువైన ఈ పరికరం కొనుగోలు చేస్తే, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్ల వంటివి 5 పరికరాలకు వైఫై పద్ధతిలో ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుందని చెప్పారు.
రోజురోజుకు డేటా వినియోగం పెరిగిపోతుండటంతో వినియోగదారులు ఎక్కడి నుంచైనా లాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్, డెస్క్‌టాప్‌లను ఆపరేట్ చేసుకునే విధంగా డాంగిల్‌ను రూపొందించినట్లు రామకృష్ణ చెప్పారు. వంద మీటర్ల వరకు ఈ డాంగిల్ కవరేజ్ ఉంటుందని రామకృష్ణ వివరించారు. ఎక్కడా స్పీడ్ తగ్గకుండా ఒకేసారి ఐదు డివైసెస్‌కు ఇంటర్నెట్ కనె క్ట్ అవుతుందని అన్నారు. ఇల్లు, కార్యాలయం, కారులో ఎక్కడ వినియోగించినా 100 చదరపు అడుగుల పరిధిలో వైఫై ద్వారా అనుసంధానం కావచ్చన్నారు.


Click it and Unblock the Notifications