బ్లాక్‌లిస్టులో కావూరి కంపెనీ: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు కళ్లెం: సెబి

జాతీయ రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన మూడు కాంట్రాక్టు పనుల్లో తప్పుడు సమాచారంతో అక్రమాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. నవంబర్ 26 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పిసిఎల్ అధీనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అన్ని లీగల్ సంస్థలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యం కంప్యూటర్స్‌పై కూడా అవినీతికి, అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో ప్రపంచ బ్యాంకు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు కళ్లెం: సెబీ
ముంబై: స్టాక్ మార్కెట్లో పెరిగిపోతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మార్కెట్ నియంత్రణ యంత్రాంగమైన స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) మరో పది రోజుల్లో కొత్త నిబంధనావళిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సెబి చైర్మన్ యుకె సిన్హా తెలిపారు. గురువారం క్రిసిల్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టికి హాజరైన సందర్భంగా యుకె సిన్హా మాట్లాడారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను నిరోధించడానికి కొత్త చర్యలను సూచించడానికి సెబి 2013 మార్చిలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ సెబికి తన సిఫార్సులను ఇప్పటికే సమర్పించింది. కాగా కమిటీ సిఫార్సులు సెబికి అందాయని, తుది నివేదికను రూపొందించడం కూడా జరిగిందని సిన్హా తెలిపారు. వారం, పది రోజుల్లో తుది నిబంధనావళిని ప్రకటించడం జరుగుతుందని ఆయన చెప్పారు. భారతీయ కార్పొరేట్ డెట్ మార్కెట్‌పై క్రిసిల్ ప్రచురించిన ఒక పుస్తకాన్ని సిన్హా విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications