
బుధవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)లో ఐదవ ‘ఐ దియా చాలెంజ్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వృద్ధిరేటు 7 శాతం స్థాయికి చేరితే విదేశీ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల విశ్వాసం పెరుగుతుందని, దీంతో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వారు ముందుకు వస్తారని మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో బలమైన పునరుజ్జీవం ఉంటుందని తాను చెప్పలేనని, కాని ద్వితీయార్ధంలో ఇప్పటి కన్నా చాలా మెరుగైన స్థితిలో ఉంటామని మాత్రం గట్టిగా చెప్పగలనని ఆయన తెలిపారు.
రానున్న ఆరు మాసాల కాలంలో ఆర్థిక రంగం బలంగా పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా వెలువడతాయని ఆయన విశ్వసాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందువల్ల వచ్చే ఏడాది మాత్రమే దాని ప్రభావం కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ ఇన్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చి బయటకు ప్రవహించే విదేశీ మారకద్రవ్య విలువ వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు(సిఎడి) 2013-14 స్థూల జాతీయోత్పత్తిలో 2.5శాతం నుంచి 2.7 శాతం శ్రేణిలో ఉంటుందని మాంటెక్ పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం చేపట్టే విధానాలు ఇచ్చే ఊతంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం పైబడిన వృద్ధి సాధించగలమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరుగైన వృద్ధి సాధించాలంటే మౌలిక వసతులు మరింతగా అభివృద్ధి చేయాల్సి అవసరం ఉన్నదని అహ్లూవాలియా అన్నారు. జిడిపిలో ఎనిమిది శాతం మొత్తాన్ని మౌలిక వసతుల అభివృద్ధిపై ఖర్చు చేయగలిగినప్పుడే వృద్ధిరేటు జోరుగా ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుతం మనం ఖర్చు చేస్తున్నది రెండు శాతమేనని ఆయన వివరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications