
కొత్త ధరల విధానం అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల అవుతుందని ఆయన తెలిపారు.
గ్యాస్ ధర పెంపుపై ప్రభుత్వం నిర్ణయం పట్ల అభ్యంతరం తెలుపుతూ సిపిఐ జాతీయ నేత గురుదాస్ దాస్‌గుప్తా వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీరప్ప మొయిలీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కార్టు లావాదేవీలకు ఆధార్
ఎలక్ట్రానిక్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ఆధారంగా పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఒఎస్) టెర్మినల్స్ వద్ద గానీ, లేదా ఎటిఎంల వద్ద నిర్వహించే లావాదేవీలన్నింటికీ సంపూర్ణ భద్రత కల్పించేందుకు ఆధార్‌ను అదనపు విశ్వసనీయ కొలమానంగా పరిగణించవచ్చని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు సూచించింది. ఆధార్‌ను అదనపు గుర్తింపుగా పరిగణించాలని లేదా ఇఎంవి (యూరో పే మాస్టర్‌కార్డ్ వీసా) చిప్, పిన్ టెక్నాలజీతో కార్డులు జారీ చేయాలని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
కార్డులకు ఇఎంవి నిబంధనలు వర్తింపచేయాలంటూ ఆర్‌బిఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయని కేసుల్లో ఇఎంవి టెక్నాలజీ ఆధారిత చిప్‌లకు మారడమా లేక ఆధార్‌ను వర్తింపచేయడమా అన్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకే వదిలివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ముందు జారీ చేసే కార్డులన్నీ ఇఎంవి చిప్, పిన్ టెక్నాలజీ ఆధారంగానే ఉండాలని లేదంటే ఆధార్‌ను అనుమతించాలని కూడా స్పష్టం చేసింది.
ఎటిఎం లేదా పిఓఎస్ టర్మినల్‌ల వద్ద లావాదేవీని రూఢిపరచడానికి కార్డు దారు స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. కాబట్టి, పోగొట్టుకున్న కార్డు/ దొంగతనానికి గురైన కార్డులతోపాటు, నకిలీ కార్డు మోసాల బారి నుంచి ఖాతాదారును కాపాడడానికి యూఐడిఏఐ ఆధార్ జారీ కోసం సేకరించిన బయోమెట్రిక్ ను(వేలిముద్రలు/రెటీనా స్కాన్) ఒక ప్రమాణీకరణంగా ఉపయోగించవచ్చని వివరించింది. బయో మెట్రిక్ తప్పనిసరి చేయడం వల్ల కార్డు చోరులు, నకిలీ కార్డులు చలామణిలోకి తెచ్చే శక్తులు అక్రమంగా లావాదేవీ నిర్వహించడాన్ని నిరోధించవచ్చునని పేర్కొంది.


Click it and Unblock the Notifications