హైదరాబాద్: ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఒప్పందంపై క్యాడ్‌బరీ ఇండియా ఎండీ ఆనంద్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె ప్రదీప్ చంద్రలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. ఆ ఒప్పందంలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీ సిటీ ప్రత్యేక వాణిజ్య మండలిలో నెలకొల్పే క్యాడ్‌బరీ ఉత్పాదక పరిశ్రమకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మంచి వాతావరణం రాష్ట్రంలో ఉందని గుర్తించి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమయ్యాయని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా దాదాపు ఐదు లక్షల మంది పాల ఉత్పత్తి దారులకు లబ్ధి చేకూరుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు క్యాడ్‌బరీ సంస్థ మార్గం వేసిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యను అధిగమించినట్లు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ తెలిపారు. దేశంలో అత్యధిక పెట్టుబడులు పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సమావేశాల తరువాత ప్రముఖ కంపెనీలు రాష్ట్రంపై దృష్టి సారించాయని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి వెల్లడించారు.
2015 మధ్యంతరానికి సంస్థ వెయ్యికోట్ల పెట్టుబడితో మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తుందని క్యాడ్ బరీఇండియా ఎండీ మను ఆనంద్ తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 16 వందల మందికి ఉపాధి లభించనుందని ఆయన చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా దేశీయ వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఎఓయూపై సంతకాలు
ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. క్యాడ్‌బరీ ఇండియా ఎండీ ఆనంద్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె ప్రదీప్ చంద్రలు సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు.

స్వాగతం పలుకుతున్న సిఎం
ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. క్యాడ్‌బరీ ఇండియా ఎండీ ఆనంద్‌కు స్వాగతం పలుకుతున్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలో పరిశ్రమను నెలకొల్పనున్నారు.

కరచాలనం
ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. క్యాడ్‌బరీ ఇండియా ఎండీ ఆనంద్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె ప్రదీప్ చంద్రలు సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి సమక్షంలో సంతకాలు చేసిన అనంతరం కరచాలనం.

శిలాఫలకం ఆవిష్కరణ
ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశ్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం.

ముఖ్యమంత్రి ప్రసంగం
ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications