
హెచ్ఈఆర్2+ మెటాస్టిక్ రోమ్ము క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగించే ఈ ఔషధాన్ని అమెరికా ఔషధ కంపెనీ మైలాన్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు బయోకాన్ పేర్కొంది. 2009లోనే బయోకాన్, మైలాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఔషధాన్ని క్యాన్ మాబ్ పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు.
డిసిజిఐ ఆమోద ముద్ర వేయడంతో బయోకాన్, మైలాన్ తమ ఔషధ ఉత్పత్తిని భిన్నమైన బ్రాండ్లలో మార్కెట్లలో విక్రయించనుంది. తమ ఉత్పత్తికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని, ఇప్పటికే ఉన్న ఔషధాలతో పోల్చితే నూతనంగా వచ్చిన తమ ఔషధం సరైన ధరతో అమ్మకాలు జోరుగా కొనసాగుతాయని కిరణ్ మజుందార్ షా తెలిపారు. గత త్రైమాసికంలో సొరియాసిస్ చర్మ వ్యాధికి బయోకాన్ అల్జుమాబ్ పేరుతో ఓ ఔషధాన్ని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.
ఆంటీ బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ అమ్మకాల్లో భారత మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంది. ఇప్పటికి ఈ మొత్తం అమ్మకాలను ఔషధ కంపెనీ రోషెకి చేపడుతోంది. కాగా 2012లో అంతర్జాతీయంగా ట్రాస్టుజుమాబ్ అమ్మకాలు 6.4 బిలియన్ డాలర్లు కాగా, దేశీయంగా 21 మిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా తదితర దేశాల్లో మైలాన్ ఈ ఔషధాన్ని హెర్‌ట్రాజ్ పేరుతో విక్రయిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications