రాష్ట్ర మార్కెట్లోకి అశోక్ లేలాండ్ ‘ద బాస్’
హైదరాబాద్: దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఇంటర్మీడియట్ కమర్షియల్ వాహనం ద బాస్‌ను బుధవారం రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి ద బాస్ వాహనాన్ని ఆవిష్కరించారు.
యూరోపియన్ డిజైన్ క్యాబ్, దేశీయ డ్రైవ్‌లైన్‌తో బాస్‌ను ప్రపంచ శ్రేణి నాణ్యతను భారతీయులకు అందుబాటు ధరల్లోనే అందిస్తున్నామని ఆయన చెప్పారు. బాస్ ధర రూ. 10.5 లక్షల నుంచి 12 లక్షల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వాహనాన్ని ఉత్తరాఖండ్‌లోని తమ అతి పెద్ద ప్లాంటులో రూపొందించినట్లు ఆయన తెలిపారు. ద బాస్ ఎల్ఈ, ఎల్ఎక్స్ వేరియంట్స్‌లో లభించనున్నట్లు చెప్పారు.

రోబొటిక్ ప్రాసెస్ ద్వారా ఎంతో సౌకర్యవంతంగా వాహనాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఉన్నత సామర్థ్యం కలిగిన ఈ వాహనానం రవాణా విభాగంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న ఐసివి మార్కెట్‌లో తమ సంస్థ ప్రవేశపెట్టిన ఈ వాహనం కొత్తగా, సౌకర్యవంతంగా, ఎంతో నాణ్యత, సామర్థ్యాలను కలిగి ఉందని వినోద్ కె దాసరి చెప్పారు. మూడు సంవత్సరాల వరకు వాహనానికి పూర్తి వారంటీ ఉంటుందని ఆయన తెలిపారు.
తమ ఇంజినీర్లు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారికి కావాల్సిన ఫీచర్లతో ద బాస్ వాహనాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాణిజ్య వాహనానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు తమ బాస్ వాహనానికి ఉన్నాయని ఆయన తెలిపారు.. సున్నా కిలో మీటర్ రీడింగ్ కలిగిన బాస్ వాహనాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రముఖ ఆర్థిక సంస్థలు, ఇన్స్యూరెన్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుని ఉందని ఆ సంస్థలు వినియోగదారులకు వాహన కొనుగోలు సందర్భంలో సహాయకంగా ఉంటాయని తెలిపారు.


Click it and Unblock the Notifications