ఇరాన్ ఒప్పందంతో మార్కెట్లకు ఊపిరి

ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 387.69 పాయింట్లు లాభపడి 20,605.08కి, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 119.90 పాయింట్లు పెరిగి 6,115.35 పాయింట్లకు ఎగబాకాయి. వరుసగా మూడు రోజులపాటు నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లకు.. సోమవారం భారీ లాభాలు రావడంతో మదుపర్ల సంపద లక్ష కోట్లు పెరిగింది. అణు కార్యక్రమాన్ని కట్టడి చేయడానికి ఇరాన్ అంగీకరించడం వల్ల ఆ దేశంపై ఉన్న ఆంక్షలు తొలగిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు కూడా పడిపోవడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.
సోమవారం ఉదయం ప్రారంభం నుంచి క్రమేణా పుంజుకున్న సూచీలు.. ముగింపు సమయం దగ్గర పడుతున్నకొద్దీ లాభాలను పెంచుకున్నాయి. ఆసియా మార్కెట్లలోని చైనా, హాంకాంగ్, సూచీలు లాభపడ్డాయి. ఇక ఐరోపా మార్కెట్లలో ఎఫ్‌టిఎస్‌ఇ, సిఎసి, డాక్స్ సూచీలు పెరిగాయి. ఇదిలావుంటే దేశీయ మార్కెట్లలో బిహెచ్‌ఇఎల్ అత్యధికంగా 5.22 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 5.07 శాతం పుంజుకున్నాయి. ఎల్‌అండ్‌టి, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ షేర్లూ మదుపర్లను ఆకట్టుకున్నాయి. ఇంకా టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, మారుతీ సుజుకి, హీరో మోటా కార్ప్, బజాజ్ ఆటోలు 2.37-3.28శాతం మేర లాభపడ్డాయి.
స్వల్పంగా పెరిగిన రూపాయి విలువ
ఇరాన్ సంక్షోభానికి తాత్కాలిక పరిష్కారం లభించిందన్న వార్తల నేపథ్యంలో విదేశీ ద్రవ్య మార్కెట్‌లో అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి బలం పుంజుకుంది. గత ముగింపుతో పోల్చితే 37 పైసలు పుంజుకున్న రూపాయి 62.50 వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications