వృద్ధిరేటు: భారత్‌కు సత్తా ఉంది: ముకేష్

భారత్ నియంత్రణపరమైన సంకెళ్లను సడలించుకొన్న తరువాతనే ఆర్థిక వృద్ధి నమోదైనట్లు ఆ వ్యాసంలో తెలిపారు. భారత్‌ను మరింత ముందుకు నడిపేటందుకు తీసుకునే చర్యలు పిరికి స్వభావంతో కూడినవిగా కాకుండా విస్తృతమైనవీ, సమగ్రమైనవీ అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వం అందరూ కలిసి వస్తేనే దేశంలోని యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడం, కోట్ల మంది కింది స్థాయి వర్గాల వారికి ఆర్థిక సాధికారతను అందించగలమని ముకేష్ అంబానీ పేర్కొన్నారు. 2030 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందనే అంచనాలు ఉన్నాయన్నారు.
ఒడిదుడుకుల్లోనే మార్కెట్ల పయనం
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం కూడా ఒడిదుడుకులకు గురికావచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారంతో ముగియనున్న నెలసరి డెరివేటివ్‌ల కాంట్రాక్ట్, ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి శుక్రవారం వెల్లడి కానున్న జిడిపి గణాంకాల వలన ఈ వారం మదుపర్లు ఒత్తిడికి లోనయ్యే వీలుందని వారు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా ఉద్దీపనల ఉపసంహరణలపై అందే సమాచారం కూడా దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేయొచ్చని వారంటున్నారు.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా మార్కెట్ కదలికలను నిర్దేశించే అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, దేశీయంగా రాజకీయ, ఆర్థిక రంగాల పరిస్థితులు సమీప కాలంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని బొనాంజా పోర్ట్ఫోలియో లిమిటెడ్‌కు చెందిన సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ నిధీ సారస్వత్ పేర్కొన్నారు. ఈ వారం నిఫ్టీలో 5,970 స్థాయి కీలకమైనదని, పెట్టుబడులపై ఇది నిర్ణయాత్మకమైనదిగా ఆయన చెప్పారు. ఈ స్థాయిని దాటితే అమ్మకాల ఒత్తిడి నమోదయ్యే వీలుందని సారస్వత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications